Realme P4 Pro 5G and Realme P4 Pro 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన ‘పీ’ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఈరోజు భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఆకర్షణీయమైన లుక్‌తో రియల్‌మీ పీ4 5జీ, రియల్‌మీ పీ4 ప్రో 5జీలను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫోన్‌లలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, 144 హెడ్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, 7000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉండనున్నాయి. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ పలు ఫీచర్లు లీక్ అయ్యాయి. కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ వాంగ్ తాజాగా బేస్ వేరియంట్ ధరను వెల్లడించారు. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
Realme P4 5G Price:
నివేదికల ప్రకారం.. రియల్‌మీ పీ4 5జీ బేస్ వేరియంట్ ధర రూ.17,499గా ఉండనుంది. అయితే ఈ ధర బ్యాంక్ డిస్కౌంట్ అనంతరం మరింత తక్కువగా ఉండవచ్చు. గత ఫిబ్రవరిలో రియల్‌మీ పీ3 5జీ లాంచ్ కాగా.. ఆ ఫోన్ ధర రూ.16,999గా ఉంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.2 వేల తగ్గింపును అందించింది. ఇప్పుడు కూడా 2 వేల తగ్గింపు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ధర, ఆఫర్స్‌పై పూర్తి క్లారిటీ రానుంది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్స్ కొనుగోలు చేయొచ్చు.
Realme P4 5G Features:
రియల్‌మీ పీ4 5జీ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5 జి ప్రాసెసర్ ఇవ్వబడుతుంది. మెరుగైన గ్రాఫిక్స్, గేమింగ్ పనితీరు కోసం పిక్సెల్‌వర్క్స్ చిప్ ఉండనుంది. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అందించబడుతుంది. 7000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. చాంబర్ కూలింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కువసేపు గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కదు. 20 వేల లోపు ప్రత్యేకమైన గ్రాఫిక్స్ చిప్ ఉన్న మొదటి స్మార్ట్‌ఫోన్‌గా దీనిని అభివర్ణిస్తున్నారు.
Also Read: World Cup 2025: ప్రపంచకప్ జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్స్.. భారత జట్టు ఇదే!
Realme P4 Pro 5G Features:
రియల్‌మీ పీ4 ప్రో 5జీలో కూడా పీ4 5జీలో ఉన్న ఫీచర్స్ ఉంటాయి. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, హైపర్‌విజన్ AI GPU లాంటి ఫీచర్స్ అదనంగా ఉంటాయి. ఈ ఫోన్ కూడా 7000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర వెల్లడించలేదు. నేడు భారతదేశంలో లాంచ్ అయిన తర్వాత రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.
