Site icon NTV Telugu

Realme New Phone: రియల్‌మీ నుంచి సరికొత్త ఫోన్.. 10000 ఎంఏహెచ్ బ్యాటరీ, 320W ఫాస్ట్ ఛార్జింగ్!

Realme 10000mah Battery

Realme 10000mah Battery

Realme is set to launch 10000mAh Battery Smartphone: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. అతి పెద్ద బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఇటీవల టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పేరును రియల్‌మీ ఇంకా రివీల్ చేయలేదు. బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుందని మాత్రమే పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో 10000 ఎంఏహెచ్ బ్యాటరీతో కాన్సెప్ట్ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు రియల్‌మీ తెలిపింది.

రియల్‌మీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో కొత్త ఫోన్‌కు సంబందించి ఓ పోస్ట్ చేసింది. సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 27న లాంచ్ కానుంది పేర్కొంది. ‘1x000mAh’ బ్యాటరీ అని రాసుకొచ్చింది. ఆ x బహుశా 10000 ఎంఏహెచ్ బ్యాటరీ అని టెక్ నిపుణులు అంటున్నారు. ఇదే నిజమైతే రియల్‌మీ అతిపెద్ద బ్యాటరీ ఫోన్ ఆ ఫోన్ అవుతుంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌కు 320W ఫాస్ట్ ఛార్జింగ్ సప్పోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో కొత్త ఫోన్‌కు సంబందించి అన్ని డీటెయిల్స్ తెలియరానున్నాయి.

Also Read: Medipally Murder: భర్య మృతదేహా ముక్కలను మూసీ నదిలో పడవేసిన మహేందర్‌!

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో రియల్‌మీ చైనాలో రియల్‌మీ జీటీ 7 సిరీస్‌ను ప్రారంభించింది. కొన్ని రోజులకు భారతదేశంలో కూడా ఆ సిరీస్ లాంచ్ చేసింది. జీటీ 7 సిరీస్‌లో భాగంగా రియల్‌మీ జీటీ 7, రియల్‌మీ జీటీ 7టీ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. భారతదేశంలో ఈ హ్యాండ్‌సెట్ సిరీస్‌ను 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకొచ్చింది. రాబోయే ఫోన్ ఈ సిరీస్‌లో భాగమవుతుందని భావిస్తున్నారు. బ్యాటరీ మినహా సరికొత్త స్మార్ట్‌ఫోన్ డీటెయిల్స్ ఏమీ తెలియరాలేదు. ఏదేమైనా 10000 ఎంఏహెచ్ బ్యాటరీ అంటే మొబైల్ ప్రియులు పండగ చేసుకోవచ్చు. రియల్‌మీ, ఎంఐ, మోటో ఫోన్స్ బ్యాటరీ లైఫ్ బాగా ఇస్తాయన్న విషయం తెలిసిందే.

 

Exit mobile version