Realme Narzo 70 Pro 5G Smrtphone Launch Tomorrow in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ భారత మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఏడాది 12 ప్రో 5జీ, 12 సిరీస్‌ను లాంచ్ చేసిన రియల్‌మీ.. మంగళవారం (మార్చి 19) భారత మార్కెట్‌లోకి ‘నార్జో 70 ప్రో 5జీ’ని రిలీజ్ చేస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ నార్జో 70 ప్రో 5జీని లాంచ్ చేస్తుంది. ఈ లాంచ్ ఈవెంట్ రియల్‌మీ యూట్యూబ్, ఎక్స్ మరియు ఫేస్‌బుక్ ఖాతాలలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Realme Narzo 70 Pro Price:
రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్‌లలో అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర ఇంకా ప్రకటించబడలేదు. అయితే ఆరంభ ధర రూ.20,000 ఉండొచ్చని సమాచారం. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బర్డ్ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో వినియోగదారులు రూ. 4,299 వరకు తగ్గింపులను పొందుతారు. రూ. 2,299 విలువైన బడ్స్ టీ300ని కూడా ఉచితంగా పొందవచ్చు.
Realme Narzo 70 Pro Camera:
రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ భారతదేశపు మొట్టమొదటి సోనీ ఐఎంఎక్స్ 890 కెమెరాని కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. డుయో టచ్ గ్లాస్ డిజైన్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్‌తో ఇది రానుంది. ఈ ఫోన్‌తో ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను రీ డిఫైన్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కి మద్దతుతో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది.
Also Read: IPL 2024 Winner: ఐపీఎల్ 2024 టైటిల్ ఆర్‌సీబీదే.. మాజీ క్రికెటర్ జోస్యం!
Realme Narzo 70 Pro Battery:
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 5.0 వర్షన్‌పై రియల్‌మీ నార్జో 70 ప్రో ఫోన్ పని చేస్తుంది. 6.7 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్, 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఇందులో ఉండే అవకాశం ఉంది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ కూడా ఇందులో ఉండనుంది.