Realme Buds Wireless 5 ANC: స్మార్ట్‌ఫోన్ రంగంలో వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తున్న రియల్‌మి తాజాగా తన రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌తోపాటు రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 5 ANC నెక్‌బ్యాండ్ (Realme Buds Wireless 5 ANC) ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఆకట్టుకునే ఫీచర్లు, అందమైన డిజైన్‌తో వినియోగదారులకు మంచి అనుభూతిని ఇవ్వనుంది. ఇక ఈ రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 5 ANC నెక్‌బ్యాండ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలను వివరంగా చూద్దాం.
Also Read: Realme 14 Pro Series: ప్రపంచంలో మొట్టమొదటి రంగులు మారే ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్స్ ఇవే
ఈ నెక్‌బ్యాండ్ డిజైన్ విషయానికి వస్తే.. 13.6 mm డైనమిక్ బాస్ డ్రైవర్‌లను కలిగి ఉంది. ఇది రియల్‌మి లింక్ యాప్ ద్వారా EQ సెట్టింగ్స్ మార్చుకునే అవకాశం ఇస్తుంది. ఇందులో అదిరిపోయే నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌లను అందించారు. అవేంటంటే.. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) గరిష్ఠంగా 50dB వరకు నాయిస్‌ను తగ్గిస్తుంది. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) కాల్‌లలో స్పష్టతను పెంచుతుంది. 45ms లేటెన్సీతో 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో అనుభవం అందిస్తుంది.
Also Read: Road Accident: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి, 13 మందికి గాయాలు!
ఇక ఈ నెక్‌బ్యాండ్ కు ఒక్కసారి పూర్తిగా రీఛార్జ్ చేస్తే.. ANC ఆఫ్ మోడ్‌లో 38 గంటల పాటు పనిచేస్తుంది. ANC ఆఫ్ మోడ్ ఆన్ లో ఉంటే 20 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 20 గంటలపాటు ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. వీటికి IP55 రేటింగ్ కలిగి ఉండడంతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఇందులో కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.4, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఫీచర్‌తో రెండు డివైజ్‌లను ఒకేసారి కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ
నెక్‌బ్యాండ్ రూ. 1,799 (ప్రారంభ ఆఫర్‌లో రూ.1,599) గా నిర్ణయించారు. వీటి సేల్ జనవరి 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ నెక్‌బ్యాండ్ మిడ్‌నైట్ బ్లాక్, ట్విలైట్ పర్పుల్, డాన్ సిల్వర్ రంగులలో అందుబాటులో ఉంటుంది.