Realme GT 7T: భారత్ లో లాంచ్‌కు సిద్ధమైన రియల్మీ GT 7T.. ఫస్ట్ లుక్ విడుదల.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme GT 7T: రియల్మీ తన నూతన స్మార్ట్‌ఫోన్ సిరీస్ GT 7ను ఈ నెల 27వ తేదీన పారిస్‌లో నిర్వహించే ఈవెంట్లో గ్లోబల్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా GT 7 Pro గ్లోబల్ మార్కెట్‌కి, అలాగే GT 7T మోడల్‌ను ఇండియన్ మార్కెట్‌కి తీసుకురానున్నారు. తాజాగా కంపెనీ రియల్మీ GT 7T ఫోన్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్ను విడుదల చేసింది. ఈ ఫోన్ పసుపు రంగులో ఉండగా.. ఫ్రేమ్, వాల్యూమ్ బటన్స్ నలుపు రంగులో కనిపిస్తున్నాయి. అలాగే దీనికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది.
Read Also: Who is India’s DGMO: కాల్పుల విరమణలో కీలకంగా వ్యవహరించిన DGMO ఎవరు?
Also Read
ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది GT 7 మోడల్లో కనిపించిన ట్రిపుల్ కెమెరా సెటప్ కన్నా తక్కువ. కెమెరా డెకోలో రింగ్ LED ఫ్లాష్, హైపర్ ఇమేజ్+ లోగో కనిపిస్తోంది. ఇది కొత్త రంగులో వచ్చినా, దీని రూపకల్పన చైనా మార్కెట్లో గత నెల విడుదలైన GT 7 మోడల్‌తో పోలి ఉంటుంది. ఇక చిప్సెట్ పరంగా చూస్తే, Dimensity 8400 SoC ఈ ఫోన్లో ఉపయోగించారు. ఇది చైనా వేరియంట్లో ఉన్న Dimensity 9400+ కన్నా తక్కువ శక్తి వంతమైనది.
ఈ ఫోన్లో 8GB ర్యామ్ వేరియంట్ తోపాటు, అలాగే 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉంది. లాంచ్ అనంతరం రియల్మీ GT 7T ఫోన్‌ను అమెజాన్, రియల్మీ వెబ్ సైట్స్ లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. GT 7 వంటి ప్రత్యేకతలతో ఇది కూడా మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?