Realme GT 6 Sale Tomorrow: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్‌మీ’.. జీటీ సిరీస్‌లో భాగంగా ‘రియల్‌మీ జీటీ6’ ఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌తో సహా భారత్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. జూన్ 20న రియల్‌మీ జీటీ6 లాంచ్ కాగా.. అదే రోజు నుంచి ప్రీ-బుకింగ్ ఆర్డర్స్ మొదలయ్యాయి. ఈరోజు (జూన్ 24) రాత్రి 11:59 వరకు ప్రీ-బుకింగ్ ఉంటుంది. రియల్‌మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ బుకింగ్ అవకాశం ఉంది. ఇక మంగళవారం (జూన్ 25) నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఆరంభం అవుతాయి.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ జీటీ6 ప్రీ బుకింగ్ నడుస్తుండగా.. డెలివరీ 2-3 రోజుల్లో అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఆక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్ ఉంది. అలానే నెలకు రూ.3,417 ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.40,999గా.. 12జీబీ+256జీబీ ధర రూ.42,999గా.. 16జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది. ఫ్లూయిడ్ స్లివర్, రేజర్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
రియల్‌మీ జీటీ6లో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 8టీ ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఉండగా.. ఇది 120Hz రిఫ్రెష్ రేటు, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5తో ఈ ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ సోనీ LYT808 సెన్సర్, 50 ఎంపీ శాంసంగ్ జేఎన్5 టెలిఫొటో సెన్సర్, 8 ఎంపీ సోనీ IMX355 అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.45 ఎపర్చర్‌తో 32 ఎంపీ కెమెరాను ఇచ్చారు.
Also Read: KTR: పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!
రియల్‌మీ జీటీ6 స్మార్ట్‌ఫోన్‌లో 5,500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 10 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తవుతుందని.. 28 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఒక్క ఛార్జ్‌పై బ్యాటరీ గరిష్టంగా 46 గంటల టాక్‌టైమ్ లేదా ఎనిమిది గంటల పబ్‌జీ గేమ్‌ప్లేను అందిస్తుంది. ఈ ఫోన్ బరువు 199 గ్రాములు.