NTV Telugu Site icon

Realme GT 6 Price: ‘రియల్‌మీ’ సరికొత్త ఫోన్‌.. 10 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌!

Realme Gt 6 5g Price

Realme Gt 6 5g Price

Realme GT 6 5G Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్‌మీ’ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చింది. జీటీ సిరీస్‌లో భాగంగా ‘రియల్‌మీ జీటీ6’ ఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌తో సహా భారత్‌ మార్కెట్‌లో గురువారం (జూన్ 10) లాంచ్ చేసింది. 50 ఎంపీ సోనీ కెమెరా, 5,500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 4ఎన్‌ఎమ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. ఏఐ ఫీచర్‌లను కలిగి ఉన్న రియల్‌మీ మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. రియల్‌మీ జీటీ6 ధర, ఫీచర్స్ వివరాలు చూద్దాం.

Realme GT 6 Price:
రియల్‌మీ జీటీ6 ఫోన్‌ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.40,999 కాగా.. 12జీబీ+256జీబీ ధర రూ.42,999గా ఉంది. ఇక హైఎండ్ 16జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది. ఫ్లూయిడ్ స్లివర్, రేజర్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. రియల్‌మీ వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ బుకింగ్‌ ఆర్డర్లు మొదలయ్యాయి. ముందుగా బుక్‌ చేసుకున్న యూజర్లకు ఆరు నెలల పాటు స్క్రీన్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌ ఇవ్వనున్నారు. ఇక ఎంపిక చేసిన కార్డుపై రూ.4వేలు ఇన్‌స్టంట్‌ డిస్కెంట్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.

Realme GT 6 Camera:
రియల్‌మీ జీటీ6లో 6.78 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ 8టీ ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటు, 6000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఫోన్ వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ సోనీ LYT808 సెన్సర్‌, 50 ఎంపీ శాంసంగ్‌ జేఎన్‌5 టెలిఫొటో సెన్సర్‌, 8 ఎంపీ సోనీ IMX355 అల్ట్రా వైడ్‌ సెన్సర్‌ ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.45 ఎపర్చర్‌తో 32 ఎంపీ కెమెరా ఉంటుంది.

Also Read: Vivo Y58 5G Price: ‘వివో’ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ! ధర కూడా తక్కువే

Realme GT 6 Battery:
రియల్‌మీ జీటీ6 స్మార్ట్‌ఫోన్‌లో 5,500mAh బ్యాటరీ ఉంది. ఇది 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 10 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. అలానే 28 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుందని పేర్కొంది. ఒక్క ఛార్జ్‌పై బ్యాటరీ గరిష్టంగా 46 గంటల టాక్‌టైమ్ లేదా ఎనిమిది గంటల పబ్‌జీ గేమ్‌ప్లేను అందిస్తుంది. ఈ ఫోన్ 199 గ్రాముల బరువు ఉంటుంది. బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌, వై-ఫై6 వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

Show comments