NTV Telugu Site icon

Realme GT 5 Launch 2023: బెస్ట్ బ్యాటరీ, అద్భుత ఫీచర్లతో రియల్‌మీ జీటీ 5 స్మార్ట్‌ఫోన్‌!

Realme Gt 5

Realme Gt 5

Realme GT 5 Smartphone Launch Date 2023: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘రియల్‌మీ’ నుంచి మరో సరికొత్త ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. అదే రియల్‌మీ జీటీ 5 స్మార్ట్‌ఫోన్‌. వచ్చే రెండు వారాల్లో చైనాలో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అయితే కంపెనీ ఇంకా ఖచ్చితమైన లాంచ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. రియల్‌మీ జీటీ 5 లాంచ్ కాకముందే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 240W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుందని తెలుస్తోంది. రియల్‌మీ జీటీ 5కి సంబందించిన వివరాలు ఓసారి చూద్దాం.

ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన రియల్‌మీ జీటీ 3కి కొనసాగింపుగా (అప్‌గ్రేడ్ వెర్షన్) రియల్‌మీ జీటీ 5 స్మార్ట్‌ఫోన్‌ రానుంది. రియల్‌మీ కంపెనీ చైనా ప్రెసిడెంట్ వివరాల ప్రకారం.. ఈ ఫోన్ గరిష్టంగా 24GB RAMతో వస్తుంది. క్వాల్‌కామ్‌ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8Gen 2 SoC ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవనుంది. అయితే ఈ ఫోన్ కచ్చితమైన ప్రారంభ తేదీని మాత్రం అతడు వెల్లడించలేదు.

రియల్‌మీ జీటీ 5 స్మార్ట్‌ఫోన్‌ 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 ఇంచెస్ అమోలెడ్‌ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు RAM కాన్ఫిగరేషన్‌ల అందుబాటులో ఉంటుంది. 16GB మరియు 24GB RAM.. 128GB నుంచి 1TB స్టోరేజ్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో శక్తివంతమైన Sony IMX890 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ వెనక వైపు ఉంటాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

Also Read: Redmi Note 11S Price: అమెజాన్‌లో టాప్ ఆఫర్.. రూ. 799కే రెడ్‌మీ నోట్‌ 11ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌!

దాదాపుగా 5200mAh బ్యాటరీతో రియల్‌మీ జీటీ 5 స్మార్ట్‌ఫోన్‌ రానుందని సమాచారం. ఇది 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. రియల్‌మీ ఫోన్ 240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రావడం ఇదే మొదటిసారి కాదు. ఒప్పో తన 240W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌ను ప్రారంభించినప్పటి నుంచి దాని సబ్ బ్రాండ్ అయిన రియల్‌మీ.. రియల్‌మీ జీటీ నియో 5 వంటి అనేక స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించింది.