NTV Telugu Site icon

Realme 13 Pro Series: జూలై 30న ‘రియల్‌మీ’ 13 ప్రో సిరీస్.. ధర, స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఇవే!

Realme 13 Pro Series On July 30

Realme 13 Pro Series On July 30

Realme 13 Pro Series Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘రియల్‌మీ’ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్దమైంది. 13 సిరీస్‌లో భాగంగా జూలై 30న రియల్‌మీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో+ పేరిట వీటిని లాంచ్‌ చేయనుంది. దాంతో రియల్‌మీ కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనుంది. ఎప్పటిలానే ఫోటోగ్రఫీ మరియు డిజైన్‌పై రియల్‌మీ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఆరంభంలో 12 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. లాంచ్‌కు ముందు ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర, స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

Realme 13 Pro+ Launch:
రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లోని ఈవెంట్ పేజీ ప్రకారం.. జూలై 30 మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో+ లాంచ్ అవుతాయి. రియల్‌మీ వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. మోనెట్ గోల్డ్, ఎమరాల్డ్ గ్రీన్, పర్పుల్ షేడ్‌ రంగుల్లో రానున్నాయి. డిజైన్ పరంగా 12 కంటే 13 సిరీస్ బిన్నంగా ఉంటుంది. 12లో ఉండే నిలువు గీత 13లో రాదు. కెమెరా డిజైన్ కూడా మారింది. 13 ప్రో రూ.26-28 వేల మధ్య.. 13 ప్రో+ ధర రూ.30-35 వేల మధ్య ఉండవచ్చు.

Realme 13 Pro+ Specs:
రియల్‌మీ 13 సిరీస్ 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటుతో రానుంది. స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జనరేషన్‌ 2 ప్రాసెసర్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0తో పనిచేస్తుంది. 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది. ఈ ఫోన్స్ 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 8జీబీ+256జీబీ, 8జీబీ+512జీబీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

Also Read: Samsung Galaxy A06 Launch: ‘శాంసంగ్‌’ నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Realme 13 Pro+ Camera and Battey:
రియల్‌మీ 13 ప్రో+లో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-701 ప్రధాన కెమెరా ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలతో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 పెరిస్కోప్ టెలిఫోటో, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఉండనుంది. రియల్‌మీ 13 ప్రోలో టెలిఫోటో లేదా పెరిస్కోప్ లెన్స్‌ ఉండే అవకాశం లేదు. రెండు ఫోన్‌లలో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీ ఉండనుంది.