Realme 13 Pro Series: జూలై 30న ‘రియల్‌మీ’ 13 ప్రో సిరీస్.. ధర, స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఇవే!
- జూలై 30న రియల్‌మీ 13 ప్రో సిరీస్
- ఫ్లిప్‌కార్ట్‌లలో అమ్మకాలు
- 12 కంటే బిన్నంగా 13 సిరీస్ డిజైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 13 Pro Series Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘రియల్‌మీ’ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్దమైంది. 13 సిరీస్‌లో భాగంగా జూలై 30న రియల్‌మీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో+ పేరిట వీటిని లాంచ్ చేయనుంది. దాంతో రియల్‌మీ కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనుంది. ఎప్పటిలానే ఫోటోగ్రఫీ మరియు డిజైన్‌పై రియల్‌మీ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఆరంభంలో 12 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. లాంచ్‌కు ముందు ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర, స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
Realme 13 Pro+ Launch:
రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లోని ఈవెంట్ పేజీ ప్రకారం.. జూలై 30 మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో+ లాంచ్ అవుతాయి. రియల్‌మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. మోనెట్ గోల్డ్, ఎమరాల్డ్ గ్రీన్, పర్పుల్ షేడ్ రంగుల్లో రానున్నాయి. డిజైన్ పరంగా 12 కంటే 13 సిరీస్ బిన్నంగా ఉంటుంది. 12లో ఉండే నిలువు గీత 13లో రాదు. కెమెరా డిజైన్ కూడా మారింది. 13 ప్రో రూ.26-28 వేల మధ్య.. 13 ప్రో+ ధర రూ.30-35 వేల మధ్య ఉండవచ్చు.
Also Read
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
Realme 13 Pro+ Specs:
రియల్‌మీ 13 సిరీస్ 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో రానుంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0తో పనిచేస్తుంది. 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఈ ఫోన్స్ 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 8జీబీ+256జీబీ, 8జీబీ+512జీబీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.
Also Read: Samsung Galaxy A06 Launch: ‘శాంసంగ్’ నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
Realme 13 Pro+ Camera and Battey:
రియల్‌మీ 13 ప్రో+లో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-701 ప్రధాన కెమెరా ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలతో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 పెరిస్కోప్ టెలిఫోటో, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఉండనుంది. రియల్‌మీ 13 ప్రోలో టెలిఫోటో లేదా పెరిస్కోప్ లెన్స్ ఉండే అవకాశం లేదు. రెండు ఫోన్‌లలో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీ ఉండనుంది.
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!