NTV Telugu Site icon

Realme 11 5G Launch: ఆగష్టు 23న రియల్‌మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!

Realme 11 5g

Realme 11 5g

Realme 11 Series 5G and Realme 11X 5G Smartphones Launch in India on August 23rd: చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ భారత్ మార్కెట్లో తన రియల్‌మీ 11 5జీని త్వరలోనే లాంచ్ చేయనుంది. ఆగష్టు 23న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ రిలీజ్ అవుతుందని రియల్‌మీ అధికారికంగా తెలిపింది. అంతేకాదు రియల్‌మీ 11 ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ కూడా భారతదేశంలో అదే రోజు లాంచ్ అవుతుంది. ఈ లంచ్ ఈవెంట్‌ను రియల్‌మీ కంపెనీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మీరు ట్విట్టర్ (X) మరియు పేస్ బుక్ ద్వారా కూడా అప్‌డేట్‌లను పొందవచ్చు.

Realme 11 5G Price:
రియల్‌మీ కంపెనీ తన రియల్‌మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధరను అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. అయితే పలు నివేదికల ప్రకారం… రియల్‌మీ11 5జీ ఫోన్ 8GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర దాదాపు రూ. 18,000 (1599 చైనా యువాన్లు)గా ఉండనుంది. అదే సమయంలో 12GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ. 20,600 (1799 చైనా యువాన్లు)గా ఉంటుంది. నలుపు, లేత గోధుమరంగు మరియు నీలం రంగులలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. రియల్‌మీ స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అమ్మకాలు అందుబాటులో ఉండనున్నాయి.

Realme 11 5G Camera:
రియల్‌మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఒక్టాకోర్ 7ఎన్ఎం బేస్డ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 5జీ ఎస్వోసీ చిప్‌సెట్‌తో రానుంది. ఆండ్రాయిడ్‌-13 బేస్డ్ రియ‌ల్‌మీ యూఐ 4.1 ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ఇది చేస్తుంద‌ని సమాచారం. 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (2400×1080 పిక్సెల్స్‌) డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 240 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్‌తో రానుంది. ఇందులో 108-మెగా పిక్సెల్స్ ప్రైమ‌రీ రేర్ హెచ్‌6 సెన్స‌ర్ విత్ ఇన్‌-సెన్సార్ 3ఎక్స్ జూమ్ స‌పోర్ట్‌తో డ్యూయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్ కెమెరా ఉండనుంది.

Also Read: Akshay Kumar IPL: కోట్ల రూపాయల ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ వదిలేసిన అక్షయ్ కుమార్.. సీజన్‌, ప్రాంచైజీ ఏదంటే?

Realme 11 5G Battery:
రియల్‌మీ 11 5జీ ఫోన్ వాట్స్ సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో కూడిన 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌స్తుంది. 17 నిమిషాల్లో 50 శాతం, 47 నిమిషాల్లో 100 శాతం బ్యాట‌రీ ఫుల్ అవుతుంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్‌ ఉటుంది. 5జీ, 4జీ వోల్ట్‌, వై-ఫై, బ్లూ టూత్‌, గాలిలియో, గ్లోనాస్‌, యూఎస్బీ టైప్‌-సీ క‌నెక్టివిటీ లాంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి.