Site icon NTV Telugu

Re Release : న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెబుతున్న రీ రిలీజ్ సినిమాలు

New Project 2024 12 27t074718.635

New Project 2024 12 27t074718.635

Re Release : ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల పరంపర కొనసాగుతోంది. తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు, స్పెషల్ డేల సందర్భంగా.. వారు నటించిన హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలోకి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ నటించిన సినిమాలు రీ రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించాయి. రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ ఇంకా నడుస్తోంది. తమ అభిమాన చిత్రాలను రీ-రిలీజ్ చేస్తూ అభిమానులు థియేటర్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఈ రీ-రిలీజ్ చిత్రాలు కూడా రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో, స్టార్స్ అందరూ తమ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే, మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో కొన్ని రీ-రిలీజ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి.

Read Also:Manmohan Singh Passes Away Live Updates: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కన్నుమూత.. పలువురు సంతాపం, లైవ్‌ అప్‌డేట్స్!

వాటిలో ముఖ్యంగా 1996లో మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ మూవీ ‘హిట్లర్’.. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను జనవరి 1న రీ-రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు మెగా ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన స్పోర్స్ట్ డ్రామా మూవీ ‘సై’ టాలీవుడ్‌కి రగ్బీ ఆట అంటే ఏంటో పరిచయం చేసింది. నితిన్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమా కూడా జనవరి 1న రీ-రిలీజ్ కానుంది.

Read Also:Manmohan Singh: శనివారం అధికార లాంఛనాలతో మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు..

ఈ రెండు సినిమాలతో పాటు లవర్ బోయ్ హీరో సిద్ధార్థ్, షామిలి నటించిన క్లాసిక్ లవ్‌స్టోరీ ‘ఓయ్’ మూవీ కూడా రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇప్పటికే ఒకసారి రీ-రిలీజ్ కాగా, దీనికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు రెండోసారి ‘ఓయ్’ మూవీ రీ-రిలీజ్ అవుతుంది. మరి ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వస్తున్న ఈ మూడు చిత్రాలు రీ-రిలీజ్‌లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయనేది చూడాలి.

Exit mobile version