ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఆర్సిఎఫ్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి గడువు ఆగస్టు 9గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rcfltd.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..
ఖాళీలు :
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్)-6
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్)-10
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-12
మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్)-1
మేనేజ్‌మెంట్ ట్రైనీ (సేఫ్టీ)-4
మేనేజ్‌మెంట్ ట్రైనీ (సీసీ ల్యాబ్)-7
మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్)-37
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐటీ)-3
మేనేజ్‌మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్సెస్)-2
మేనేజ్‌మెంట్ ట్రైనీ (హెచ్ఆర్డీ)-2
మేనేజ్‌మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్)-1
మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్)-28
మేనేజ్‌మెంట్ ట్రైనీ (బాయిలర్)-1
అర్హతలు:
యూజీసీ/ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థల నుంచి సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. లేదా మూడేళ్ల డిప్లొమా తర్వాత మూడేళ్ల రెగ్యూలర్ బీఈ/బీటెక్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్లు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..
దరఖాస్తు ఫీజు రూ. 1000 ఉండగా.. SC/ST/PwBD/ExSM/మహిళా కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు..
ఇంటర్వ్యూ : ఆన్ లైన్ టేస్ట్, ఇంటర్వ్యూ..
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
*.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను www.rcfltd.comను సందర్శించండి.
*.హోమ్‌పేజీలో, అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ ది మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్, బాయిలర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, సేఫ్టీ, CC ల్యాబ్, మార్కెటింగ్, IT, హ్యూమన్ రిసోర్సెస్, HRD, అడ్మినిస్ట్రేషన్)పై క్లిక్ చేయండి.
*.కొత్త పేజ్ ను ఓపెన్ చేసి దరఖాస్తూ చేసుకోవాలి.. అలాగే ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి..
ఆసక్తి, అర్హతలు కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోవాలి..
