Site icon NTV Telugu

Yash Dayal: అత్యాచారం కేసులో ఆర్‌సీబీ ప్లేయర్‌కు భారీ ఎదురుదెబ్బ.. అరెస్ట్ తప్పదా..?

Yash Dayal

Yash Dayal

Yash Dayal Case: మైనర్‌పై అత్యాచారం కేసులో ఆర్‌సీబీ ఫాస్ట్ బౌలర్ యష్ దయాళ్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అరెస్ట్‌పై స్టే విధించాలని యష్ రాజస్థాన్ హైకోర్టును సంప్రదించాడు. విచారణ జరిపిన కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో పాటు, ఆగస్టు 22న కేసు డైరీని సమర్పించాలని ప్రాసిక్యూషన్‌ను కోర్టు కోరింది. యష్ దయాల్ క్రిమినల్ పిటిషన్‌పై ప్రాథమిక విచారణను విచారిస్తూ జస్టిస్ సుదేష్ బన్సాల్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు మైనర్ కు సంబంధించినదని కోర్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితిలో స్టే విధించలేమని స్పష్టం చేసింది. ఆర్సీబీ ప్లేయర్ యష్‌ దయాల్ కేసులో పోలీసుల చర్యలను ఆపలేమని తేల్చి చెప్పింది. కాగా.. హైకోర్టులో విచారణ సందర్భంగా, యష్ దయాళ్ న్యాయవాది ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో నమోదైన ఇలాంటి కేసును ప్రస్తావించారు. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అరెస్టును నిలిపివేసిందని వివరించారు. అయితే, ఈ కేసు మైనర్‌కు సంబంధించినదని చెబుతూ కోర్టు ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22కు వాయిదా వేసింది. ఈ తీర్పు అనంతరం యష్ అరెస్ట్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.

READ MORE: RBI Governor: కొత్త బాంబ్ పేల్చిన ఆర్బీఐ బాస్..! ఇకపై లెక్క కట్టాల్సిందేనా?

అసలు ఏంటి ఈ కేసు..?
క్రికెట్​లో కెరీర్‌ చూపిస్తానని నమ్మించి రెండేళ్లుగా యష్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని రాజస్థాన్‌కు చెందిన ఓ యువతి గతంలో ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజస్థాన్‌లోని సంగనేర్ పోలీస్ స్టేషన్‌లో యష్‌పై పోక్సో కేసు నమోదైంది. దీంతో యశ్ దయాల్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. జైపుర్​లో తొలిసారి తాను యష్‌ను కలిసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో వెల్లడించింది. క్రికెట్‌ కెరీర్​లో సలహాలు ఇస్తానంటూ సీతాపురలోని ఓ హోటల్‌కు తనను పిలిచి అక్కడ లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఆ తర్వాత నుంచి బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ రెండేళ్ల పాటు తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. లైంగిక వేధింపులు మొదలైనప్పుడు బాధితురాలి ఏజ్ 17 ఏళ్లు కావడంతో పోక్సో చట్టం కింద యష్‌ సంగనేర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతకు ముందు.. ఉత్తరప్రదేశ్‌ని గాజియాబాద్‌కు చెందిన ఓ యువతి యష్‌ దయాళ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. గత ఐదేళ్లుగా తనతో రిలేషన్‌ షిప్​లో ఉన్నాడని చెప్పింది. కాబోయే కోడలు అంటూ ఇంట్లో పరిచయం చేసి ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేశాడని చెప్పింది. కొంతకాలం తర్వాత యష్‌కు ఇతర అమ్మాయిలతో సంబంధాలున్నాయని తెలిసిందని వెల్లడించింది. ఈ క్రమంలో గాజియాబాద్​లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యష్‌పై పోలీసులు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. యష్‌ అలహబాద్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సిద్ధార్థ వర్మ, జస్టిస్ అనిల్ కుమార్​లతో కూడిన ధర్మాసనం యశ్ దయాళ్​ను అరెస్టు చేయకుండా స్టే విధించింది.

READ MORE: Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..

Exit mobile version