ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన బెంగళూరు.. బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఆడిన 6 మ్యాచ్ ల్లో ఐదింటిలో ఓడిపోయిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలని పట్టుదలతో బరిలోకి దిగుతుంది. మరోవైపు సన్ రైజర్స్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ రెండు మార్పులు చేసింది. సిరాజ్ స్థానంలో యశ్ దయాళ్, మ్యాక్స్ వెల్ స్థానంలో ఫెర్గుసన్ కు అవకాశం కల్పించారు.
సన్ రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నటరాజన్.
బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, సౌరవ్ చౌహాన్, విల్ జాక్స్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, రీస్ టోప్లీ, విజయ్ కుమార్ వైశాఖ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాళ్