ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నైతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది బెంగళూరు. చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే 219 పరుగుల టార్గెట్ ను చేధించాలి. బెంగళూరు బ్యాటింగ్ లో అందరూ సమిష్టిగా రాణించారు. ఆర్సీబీ ఓపెనర్లలో విరాట్ కోహ్లీ (47), డుప్లెసిస్ (54) పరుగులతో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత.. రజత్ పటిదార్ (41) పరుగులతో చెలరేగాడు. కెమెరాన్ గ్రీన్ (38*) నిలిచాడు. దినేష్ కార్తీక్ (14), మ్యాక్స్ వెల్ (16) పరుగులు చేశారు.
Read Also: Drunkard Hulchul: మత్తులో ఖాకీలపై చిందులు.. నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను కొట్టిన మందుబాబు..
అత్యధికంగా.. కెప్టెన్ డుప్లెసిస్ 54 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. ఇక.. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత తుషార్ దేశ్ పాండే, మిచెల్ సాంథ్నర్ తలో వికెట్ సంపాదించారు. కాగా.. చెన్నై ఈ మ్యాచ్ లో గెలవాలంటే బ్యాటర్లు నిలకడగా ఆడి రాణించాలి. మరోవైపు.. ఆర్సీబీ గెలవాలంటే, సీఎస్కే బ్యాటర్లను 200 పరుగులకే ఆలౌట్ చేయాలి. అలా అయితేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు వెళ్తుంది. చూడాలి మరీ ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో.
Read Also: Suriya Kanguva: 10,000 మందితో ఆ ఒక్క వార్ సీన్.. గూస్ బంప్స్ పక్కా..