Site icon NTV Telugu

RCB vs PBKS: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం.. ఈ విజయానికి అతడే కారణం: ఆర్‌సీబీ కెప్టెన్

Faf Du Plessis Rcb

Faf Du Plessis Rcb

Faf du Plessis Says Virat Kohli very passionate about playing cricket: దినేశ్ కార్తీక్ కారణంగానే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. మహిపాల్ లోమ్రోర్ చేసిన పరుగులు విజయానికి బాటలు వేశాయని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడు విలువైన పరుగు చేశాడని కొనియాడాడు. డీకే వంటి ఆటగాడు జట్టులో ఉండటం తమ అదృష్టం అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. సోమవారం రాత్రి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. దినేశ్‌ కార్తీక్‌ 10 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సులతో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ… ‘బయటికి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం వేరేలా ఉంది. టోర్నీ ఆరంభంలోనే విజయాలు సాదించాలి. త్వరలోనే వరుస విజయాలు ఆదుకుంటామని ఆశిస్తున్నా. మా ఆటగాళ్లు చివరి వరకు ప్రశాంతంగా ఆడారు. దినేశ్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్‌లో ఏ దశలోనూ ఓడిపోతామని అనుకోలేదు. కొత్త రూల్ ప్రకారం ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తీసుకునే అవకాశం ఉంది. మహిపాల్ లోమ్రోర్ మంచి బ్యాటర్‌ అని తెలుసు. అతను ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఎక్స్‌ట్రా బ్యాటర్‌ ఉన్నప్పుడు ఓవర్‌కు 14-15 పరుగులు చేయాల్సి ఉన్నా.. విజయం సాధించవచ్చు’ అని అన్నాడు.

Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగరు!

‘దినేశ్ కార్తీక్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం మా అదృష్టం. నేను గత రాత్రి చెప్పినట్లుగానే అతడు ఐపీఎల్‌ను ఆత్మవిశ్వాసంతో కొనసాగించడం చాలా ముఖ్యం. మిగిలిన టోర్నమెంట్‌కి అది బాగా ఉపయోగపడుతుంది. డీకే అనుభవం మాకు చాలా అవసరం. ఈ ప్రణాళికలతోనే అతడిని రిటైన్ చేసుకున్నాం. చిన్నస్వామి మైదానం పిచ్ డీఎన్‌ఏ తెలుసుకోవడం చాలా కష్టం. ఇది చాలా విభిన్నమైన మైదానం. ఈ రోజు పిచ్ చాలా భిన్నంగా ఉంది. పిచ్ ఫ్లాట్‌గా ఉంది. పిచ్ కండిషన్స్‌‌కు తగ్గట్లు విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. క్రికెట్ అంటే అతడికి ఎంతో పిచ్చి. ఐపీఎల్‌కు ముందు తీసుకున్న బ్రేక్ కోహ్లీకి బాగా కలిసొచ్చింది’ అని ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు.

Exit mobile version