NTV Telugu Site icon

RCB vs KKR: అంపైర్ తప్పుడు నిర్ణయంతోనే ఆర్సీబీ మ్యాచ్ ఓడిందా.. వీడియో వైరల్..

Rcb

Rcb

ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ ఒక్క పరుగుతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ఆధ్యాంతం వివాదాలకు దారి తీసినట్లు అనిపిస్తుంది. దీని కారణం విరాట్ కోహ్లీ అవుట్ అయిన సందర్భంలో కూడా ఓ వివాదం రాసుకుంది.

Also Read: MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై..

అలాగే ఈ మ్యాచ్లో మరో సందర్భం కూడా ఇప్పుడు వివాదంగా మారుతుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక డెలివరీలో అవుట్ కాగా.. అది నడుము పైన ఎత్తులో నోబాల్ గా వెళ్ళిందని భావించారు. అయితే అంపైర్లు అలాగే బ్రాడ్కాస్టర్ నిర్ణయాన్ని సమర్థించినప్పటికీ కోహ్లీ అవుట్ తో ఆయన అభిమానులు శాంతించలేదు. అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటర్ సుయాష్ ప్రభు దేశాయ్ కొట్టిన బంతి సిక్స్ వెళ్లగా కేవలం 4 పరుగులు ఇవ్వడం ఇప్పుడు వివాదానికి కారణం అవుతుంది.

Also Read: Congress: సూరత్ అభ్యర్థి మిస్సింగ్.. ఈసీకి కాంగ్రెస్ ఏం ఫిర్యాదు చేసిందంటే..!

బంతి సిక్స్ వెళ్ళిందో లేక ఫోర్ వెళ్ళిందో అనుమానం ఉన్నప్పుడు.. థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోకుండా కేవలం నాలుగు పరుగులు తోనే అంపైర్ నిర్ణయం తీసుకున్నాడని ఆర్సిబి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆర్సిబి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 17 ఓవర్లో ఐదవ బంతిని ఆడిన ప్రభు దేశాయ్ ఫైన్ లెగ్ బౌండరీ వైపు బాధడు. అయితే ఆ బంతి నేరుగా సిక్సర్ వెళ్లగా అంపైర్ ఫోర్ గా సంకేతం ఇచ్చాడు. దాంతో ఆర్సిబి రెండు పరుగులను కోల్పోగా అది మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ఆర్సిబి కేవలం ఒక్క పరుగు స్వల్ప తేడాతో ఓడిపోవడం. చూడాలి మరి ఈ చర్చ ఎంతవరకు సాగుతుందో. ఇక ఈ మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్లకు ఫైన్ పడింది.

Show comments