NTV Telugu Site icon

RCB: ఈ సాల కప్ నమ్దే.. కోహ్లీకి కలిసొచ్చిన జెర్సీ నెంబర్ 18

Kohli

Kohli

ఐపీఎల్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐపీఎల్ 18వ సీజన్ సందడి చేస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ అందిస్తోంది. ఈ సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయదుందుభి మోగించింది. ఐపీఎల్ 18వ సీజన్ లో ఆర్సీబీ బోణీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో కోల్ కతాపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈసారి జర్సీ నెంబర్ 18 కోహ్లీకి కలిసొచ్చింది. ‘ఈ సాలా కప్‌ నమ్‌దే’ అనే స్లోగన్ నిజమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Also Read:Off The Record : ఏపీ కౌన్సిల్ చైర్మన్ వ్యవహార శైలిపై చర్చ

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్లోగన్‌ ‘ఈ సాలా కప్‌ నమ్‌దే’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతి సీజన్‌ ఆరంభం మొదలుకుని బెంగళూరు ఆడే ఆఖరి మ్యాచ్‌ దాకా ఆర్‌సీబీ అభిమానులు ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉంటారు. ఐపీఎల్ సీజన్ 18.. కోహ్లీ జర్సీ నెంబర్ 18 కావడం.. తొలి మ్యాచ్ లో విక్టరీ కొట్టడంతో ఈసారి టైటిల్ తమదే అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రతి ఆటగాడు క్రీడల్లో ప్రత్యేక జర్సీ నెంబర్ తో కనిపిస్తాడు అనే విషయం తెలిసిందే. తన తండ్రి మరణించిన రోజు గుర్తుగా జర్సీ నెంబర్ 18ను వేసుకుని కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

Also Read:Murali Krishna: వివాదంలో నరసింహనాయుడు సినిమా నిర్మాత

టాస్ గెలిచిన ఆర్సీబీ, మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేకేఆర్ 174 పరుగులకే పరిమితమైంది. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. క్రీజ్‌లోకి ఎంట్రీ అయిన విరాట్ కోహ్లీ, ఫిల్‌ సాల్ట్‌ కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించారు. సాల్ట్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, కోహ్లీ కూడా అర్ధ శతకంతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి ఆర్సీబీ విజయం సాధించి, తమ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.