Site icon NTV Telugu

RCB vs CSK: రఫ్పాడించిన ఆర్సీబీ బ్యాటర్లు.. కింగ్ కోహ్లీ, షెపర్డ్‌, బెతెల్‌ తుఫాను ఇన్సింగ్స్!

Rcb2

Rcb2

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బరిలోకి దిగిన ఆర్సీబీ అయిదు వికెట్ల నష్టానికి 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కింగ్ కోహ్లీ తుఫాను చెన్నై బౌలర్లకు చుక్కలు చూయించాడు. బెతెల్‌ అర్ధ శతకంతో అదరగొట్టాడు. రొమారియో షెపర్డ్‌(53) ఊచకోత కోశాడు. చివరి రెండు ఓవర్లలో ఆరు సిక్సులు, నాలుగు ఫోర్లతో చెలరేగాడు. కేవలం 14 బాల్స్‌లో ఆర్ధశతకం పూర్తి చేశాడు.

READ MORE: Cyber Fraud: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు కీలక అప్డేట్..

మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభం లభించింది. క్రీజులోకి వచ్చిన జాకబ్‌ బెతెల్‌, విరాట్‌ కోహ్లీ క్రీజ్‌లో ఉన్నంత వరకు రఫ్పాడించారు. 10వ ఓవర్‌లో బెతెల్‌(55) అర్ధశతకం బాది ఓట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీకి తొలి దెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ బాధ్యత తీసుకొని 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. కానీ 12వ ఓవర్లోనే సామ్ కుర్రాన్ చేతిలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. కోహ్లీ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్(17) పతిరన బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్‌ ఇచ్చి జితేశ్‌ శర్మ (7) పెవిలియన్‌కు చేరాడు. పతిరన బౌలింగ్‌లో రజత్‌ పటీదార్‌ (11) ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన రొమారియో షెపర్డ్‌ చివరి రెండు ఓవర్‌లో ఆరు సిక్సులు, నాలుగు ఫోర్లతో బౌలర్ కు చెమటలు పట్టించాడు. రొమారియో షెపర్డ్‌(53), డెవిడ్ (2) నాటౌట్‌గా నిలిచారు. మరోవైపు…చెన్నై బౌలర్లలో మతీష పతిరన 3, సామ్‌ కరన్‌ 1, నూర్‌ అహ్మద్‌ 1 వికెట్‌ తీసుకున్నారు.

Exit mobile version