IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Champions: ఐపీఎల్ 2026 టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (RCB) ప్రత్యర్థి జట్లు అభినందనలు తెలియజేశాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ (GT)ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చలు, ట్రోల్స్, మీమ్స్ హోరెత్తగా.. ప్రముఖ ఫ్రాంచైజీలు మాత్రం క్రీడాస్ఫూర్తిని చాటుతూ ఆర్సీబీకి అభినందనలు తెలిపాయి.
ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) సహా పలు ఫ్రాంచైజీలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాయి. ముఖ్యంగా సీఎస్కే, ముంబై సందేశాలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఎందుకంటే ఈ రెండు జట్లు ఐపీఎల్లో ఐదేసి టైటిళ్లు గెలిచి అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలుగా నిలిచాయి. అంతేకాకుండా ఆర్సీబీతో వీరి మధ్య ఉన్న పోటీ కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి.
Also Read
- IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం.. హైదరాబాద్‌కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
- Crash Dieting: సోషల్ మీడియా డైట్స్‌తో ప్రమాదం.. యువతకు వైద్యుల కీలక హెచ్చరిక
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..
- Ramayana Trailer: లీకులకు భయపడి విడుదల చేశారా?.. 'రామాయణం' ట్రైలర్ స్ట్రాటజీపై నెట్టింట తీవ్ర చర్చ!
జూన్ 1 ఉదయం ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ ఆటగాళ్లు ట్రోఫీతో సంబరాలు చేసుకుంటున్న ఫొటోను షేర్ చేసింది. “టాటా ఐపీఎల్ 2026 గెలిచిన ఆర్సీబీకి అభినందనలు” అంటూ సందేశం పోస్ట్ చేసింది. అలాగే మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే సీఎస్కే కూడా ప్రత్యేక సందేశంతో ఆర్సీబీని అభినందించింది. “వరుసగా రెండు టైటిళ్లు గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. అభినందనలు ఆర్సీబీ… ఈ ప్రత్యేక క్లబ్‌లోకి స్వాగతం” అంటూ పోస్టు చేసింది. టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన జట్ల జాబితాలోకి ఆర్సీబీ చేరినందుకు సీఎస్కే ఈ విధంగా స్వాగతం పలికింది.
సీఎస్కే సందేశానికి ఆర్సీబీ కూడా స్పందించింది. “ధన్యవాదాలు పొరుగువారూ… వచ్చే ఏడాది మీతో జరిగే మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ సమాధానం ఇచ్చింది. ఈ స్నేహపూర్వక సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. మైదానంలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, జట్ల మధ్య పరస్పర గౌరవం కొనసాగుతుందనే విషయాన్ని ఈ పోస్టులు మరోసారి నిరూపించాయి. మొత్తంగా ఆర్సీబీ విజయం తర్వాత సోషల్ మీడియా వేదికలు మీమ్స్, ట్రోల్స్, సరదా కామెంట్లతో నిండిపోయాయి.
ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చాటింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ను 155/8 స్కోరుకే పరిమితం చేసింది. వాషింగ్టన్ సుందర్ అజేయ అర్ధశతకం సాధించినప్పటికీ, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలాం అద్భుత బౌలింగ్‌తో గుజరాత్‌ను కట్టడి చేశారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి వెంకటేశ్ అయ్యర్ మంచి ఆరంభం అందించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన క్లాస్‌ను చూపిస్తూ 42 బంతుల్లో అజేయ 75 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. టిమ్ డేవిడ్, జితేష్ శర్మ కూడా కీలక పాత్ర పోషించడంతో ఆర్సీబీ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
Congratulations @RCBTweets on winning #TATAIPL 2026 🏆 pic.twitter.com/9HT75WmcNE
— Mumbai Indians (@mipaltan) June 1, 2026
Winning back to back is always a special feeling. 🏆🏆
Congrats @RCBTweets and welcome to the club 💛#IPL2026— Chennai Super Kings (@ChennaiIPL) May 31, 2026
Congratulations @RCBTweets 👏 pic.twitter.com/dTHJMHoC3Z
— SunRisers Hyderabad (@SunRisers) May 31, 2026
It’s one thing to win it as a new captain and a whole different ball game to do it back-to-back. Congrats Rajat and @RCBTweets 👏 pic.twitter.com/lWZsptnM5I
— Rajasthan Royals (@rajasthanroyals) May 31, 2026
Back-2️⃣-Back 🏆
Simply outstanding, @RCBTweets! 👏 pic.twitter.com/y9fJxhloJj
— Punjab Kings (@PunjabKingsIPL) May 31, 2026
Played like champions. Congratulations, @RCBTweets 🏆👏 pic.twitter.com/HsD4BGzkG3
— Delhi Capitals (@DelhiCapitals) May 31, 2026
Back-to-back titles! Incredible feat, @RCBTweets. Congratulations on the second trophy. Well deserved 🏆🏆 pic.twitter.com/iFpAcenUJt
— KolkataKnightRiders (@KKRiders) May 31, 2026
Congratulations to Royal Challengers Bengaluru on being crowned #TATAIPL2026 champions 🏆👏
— Lucknow Super Giants (@LucknowIPL) May 31, 2026
తాజావార్తలు
-
Stephen Fleming Coach: మొదటిసారి కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.. కీలక మార్పులకు నాంది!
-
Suriya47: దీపావళి బరిలో ‘సూర్య47’?.. హ్యాట్రిక్ రిలీజ్‌కు స్టార్ హీరో రెడీ!
-
Dhanush : ధనుష్ నెక్ట్స్ లక్ష్యం రాజకీయాలేనా…? అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చి ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడా..?
-
HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్‌ఫోన్
-
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం.. హైదరాబాద్‌కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!