Site icon NTV Telugu

RCB 2026 Venue: RCB హోమ్ గ్రౌండ్ మారుతుందా? కొత్త గ్రౌండ్ ఏదో తెలుసా!

Rcb Home Ground Change

Rcb Home Ground Change

RCB 2026 Venue: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి వర్ణించడం సాధ్యం కాదు. అందులోను ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. ఐపీఎల్‌లో ఉండే అన్ని జట్లు ఒకలెక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరొక లెక్క. ఐపీఎల్ అనే ఫార్మట్ ఏర్పడి 17 ఏళ్లు గడిచిన తర్వాత 18వ సీజన్‌లో ఈ జట్టు కప్పును ముద్దాడింది. ఇన్నే్ళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జట్టు కప్పును ముద్దాడటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ నిర్వహించారు. కానీ ఆ సమయంలో ఊహించని తొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత నుంచి స్టేడియంకు ఎటువంటి మ్యాచ్‌లను నిర్వహించడానికి అనుమతి ఇవ్వబడలేదు. ఇప్పుడు ఐపీఎల్ 2026 కోసం సన్నాహాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ గురించి ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది.

READ ALSO: Mehbooba Mufti: ఉగ్రవాదుల తల్లిదండ్రుల్ని ‘‘వేధించవద్దు’’.. ఉగ్రవాదులకు ముఫ్తీ మద్దతు ఇస్తుందా.?

RCB హోం గ్రౌండ్ మారుతుందా?
పలు నివేదికల ప్రకారం.. IPL 2026 నిర్వహణ నుంచి చిన్నస్వామి స్టేడియం మినహాయించవచ్చని సమాచారం. ఇటీవలి మహిళల ODI ప్రపంచ కప్ సమయంలో కూడా ఈ స్టేడియాన్ని పట్టించుకోలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టేడియంలో జరిగిన తొక్కిసలాట భద్రతా ప్రమాణాల గురించి ప్రశ్నలను లేవనెత్తింది, ఇది RCB అభిమానులకు దెబ్బ, ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నిలయంగా ఉండటమే కాకుండా బ్యాటింగ్ స్వర్గధామంగా కూడా పరిగణించబడుతుంది. అయితే RCB IPL 2026లో కొత్త హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఈ స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్‌లు..
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) RCBకి ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చింది. RCB హోమ్ మ్యాచ్‌లను పూణేలోని MCA స్టేడియంలో నిర్వహించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ స్టేడియం 42 వేల కంటే ఎక్కువ మంది అభిమానుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతంలో పూణే వారియర్స్ ఇండియా, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ వంటి ఫ్రాంచైజీలకు ఈ స్టేడియం నిలయంగా ఉంది. అయితే డిసెంబర్‌లో జరగనున్న వేలం తర్వాత RCB హోమ్ గ్రౌండ్‌పై తుది నిర్ణయం అధికారికంగా రానున్నట్లు సమాచారం.

“పుణేలో ఆర్సీబీ మ్యాచ్‌లను నిర్వహించడానికి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంకా ఖరారు కాలేదు. కర్ణాటకలో తొక్కిసలాట కారణంగా వారికి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వారు మరొక వేదిక కోసం వెతుకుతున్నారు, మేము వారికి మా స్టేడియం ఇచ్చాము. ప్రాథమిక చర్చలు జరిగాయి, కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రతిదీ సరిగ్గా జరిగితే బహుశా పూణేలో ఆర్సీబీ మ్యాచ్‌లను నిర్వహిస్తుంది.” అని ఎంసీఎ కార్యదర్శి కమలేష్ పిసల్ తెలిపారు.

READ ALSO: Pakistan – Afghanistan Conflict: యుద్ధం అంచున రెండు ముస్లిం దేశాలు..!

Exit mobile version