ఐపీఎల్ 17వ సీజన్‌లో ఈరోజు కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ప్లేఆఫ్స్‌లో మిగిలిన ఏకైక బెర్తును సొంతం చేసుకోవాలంటే ఈ రెండు జట్లకు గెలుపు తప్పనిసరి. దాంతో ఈ మ్యాచ్‌పైనే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కాగా.. చివరి బెర్త్ కోసం చెన్నై, ఆర్సీబీ మధ్య టఫ్ ఫైట్ జరగనుంది.
Read Also: AP Violence: డీజీపీతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ భేటీ
బెంగళూరు జట్టు విషయానికొస్తే.. గత సీజన్లో మే 18న జరిగిన మ్యాచ్ ల్లో ప్రతిసారి గెలుస్తూ వస్తోంది. 2013లో సీఎస్కే, 2014లో సీఎస్కే, 2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2023లో సన్ రైజర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఈరోజు జరిగే మ్యాచ్లోనూ ఇదే కొనసాగుతుందని, సీఎస్కేపై గెలిచి తీరుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా.. ఈ మ్యాచ్ లో చెన్నైపై గెలిచి ఆర్సీబీ ప్లేఆఫ్స్కు వెళ్తుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Read Also: Aalavandhan OTT: 23 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న కమల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరోవైపు.. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించిన చెన్నై.. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఒక్క పాయింట్ లభించినా సరిపోతుంది. బెంగళూరుపై చెన్నై విజయం సాధించినా లేదా మ్యాచ్ రద్దయినా.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా యెల్లో ఆర్మీ ప్లేఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. రన్‌రేట్ (0.528) మెరుగ్గా ఉండడం చెన్నైకి కలిసొచ్చే అంశం. 90 శాతం అవకాశాలు చెన్నైకే ఉన్నాయని చెప్పొచ్చు.