Site icon NTV Telugu

Virat Kohli IPL Trophy: ఐపీఎల్ కప్‌తో కోహ్లీ.. రచ్చ మాములుగా లేదుగా!

Kohli Anushka

Kohli Anushka

ఐపీఎల్‌ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అవతరించింది. మంగళవారం అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో ముందుగా ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి రన్నరప్‌గా నిలిచింది. చివరి ఓవర్ నుంచే ఆర్సీబీ గెలుపు సంబరాలు మొదలయ్యాయి. ఆర్సీబీ, విరాట్ కోహ్లీ నామస్మరణతో నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఆర్సీబీ అభిమానులతో స్టేడియం అత్తా రెడ్ హార్ట్ అయింది.

Also Read: Virat Kohli: ఈ విజయం కోసం నా జీవితాన్ని దారపోశా.. చివరి వరకు ఆర్‌సీబీకే ఆడుతాను!

18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీ తొలిసారి టైటిల్‌ సాధించడంతో విరాట్‌ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యాడు. ఆపై తేరుకుని సంబరాల్లో మునిగితేలాడు. ఆర్సీబీ మాజీ ప్లేయర్స్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌తో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆర్సీబీ ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్న అనంతరం.. సతీమణి అనుష్క శర్మను హగ్‌ చేసుకున్నాడు. ఈ సందర్భంగా విరాట్ కన్నీటిని అనుష్క తుడిచారు. ఆపై కప్ అందుకున్నా కోహ్లీ తెగ సంబరపడిపోయాడు. కప్‌తో ప్రత్యేకంగా ఫొటోస్ దిగాడు. ఐపీఎల్ కప్ పట్టుకుని ప్లేయర్స్, సతీమణితో కలిసి రచ్చ రచ్చ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

Exit mobile version