Site icon NTV Telugu

Rajat Patidar: చేయని తప్పుకు బలైన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్.. రూ.24 లక్షల ఫైన్..!

Rajat Patidar

Rajat Patidar

చేయని తప్పుకు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బలయ్యాడు. నిన్న ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పటిదార్‌కి 24 లక్షల రూపాయల జరిమానా విధించారు.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన పటిదార్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగారు. దీంతో స్టాండింగ్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ జితేష్ శర్మ ఉన్నాడు. ఫీల్డింగ్ సెట్ చేయడంలో జితేష్ ఆలస్యం చేయడంతో స్లో ఓవర్ రేట్ జరిగింది. శాశ్వత కెప్టెన్ గా పటిదార్ ఉండటంతో.. బీసీసీఐ ఫైన్ విధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా స్లో ఓవర్ రేట్ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్‌కి కూడా రూ.12 లక్షల జరిమానా విధించారు..

READ MORE: BJP: కర్ణాటకలో కాంగ్రెస్ ఖతం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం..

స్లో ఓవర్ రేట్ పెనాల్టీ అంటే ఏంటి?
ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం.. జట్లు తమ 20 ఓవర్లను 90 నిమిషాలలోపు రెండు వ్యూహాత్మక టైమ్-అవుట్‌లతో సహా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, DRS తీసుకున్న సమయం, గాయం, సడన్ డ్రింక్స్ బ్రేక్ సమయాన్ని ఈ గంటన్నర నుంచి మినహాయిస్తారు. అయినప్పటికీ, ఒక జట్టు తమ 20 ఓవర్లను నిర్ధేశించిన సమయంలోపు పూర్తి చేయకపోతే, అప్పుడు జరిమానా విధిస్తారు. జట్టు మొదటిసారి స్లో ఓవర్ రేట్ సమస్యను ఎదుర్కొంటే, బౌలింగ్ జట్టు కెప్టెన్ మాత్రమే రూ.12 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ఆటగాళ్ళకు జరిమానా విధించరు. ఒక సీజన్‌లో ఒక జట్టు రెండోసారి స్లో ఓవర్ రేట్ రిపీట్ చేస్తే, బౌలింగ్ జట్టు కెప్టెన్‌కు రూ. 24 లక్షలు విధిస్తారు. ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌తో సహా జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు రూ. 6 లక్షల చొప్పున జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% విధించే అవకాశం ఉంటుంది.

READ MORE: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కస్టడీ పూర్తి.. 20 కేజీలు తగ్గారని భార్య వెల్లడి..!

Exit mobile version