గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ Rc16 సినిమాను చేయబోతున్నాడు.. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది…
ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను ఈ నెల 20 న సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు పాత్రల్లో నటించబోతున్నారు.. అయితే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది..
ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను పిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. గ్రామీణ నేపథ్యంలో తెరకేక్కుతున్న ఈ సినిమాకు ఈ టైటిల్ సరిపోతుందని అదే పిక్స్ చేశారనే వార్త వైరల్ అవుతుంది.. ఇప్పటికే చరణ్.. ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో పాల్గొనడం కూడా జరిగింది. ఆ క్యారెక్టర్స్ కూడా చరణ్ కు బాగా నచ్చాయని టాక్.. అయితే టైటిల్ ఇది కాదని మరో నాలుగు టైటిల్స్ ను పరీశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు సినిమా టైటిల్ తో పాటుగా సినిమాలో నటించే నటీనటుల గురించి ఈ నెల 20 వ తారీఖున వెల్లడించనట్లు సమాచారం.. ఎలాంటి టైటిల్ ను అనౌన్స్ చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..