RBI Update On RS. 2000 Notes: 2023 మే 19న రద్దు చేసిన 2000 రూపాయల గులాబీ నోట్లపై ఆర్బీఐ కీలక అప్డెట్ విడుదల చేసింది. ఇంకా ప్రజల నుంచి ఈ నోట్లు పూర్తిగా ఆర్‌బీఐకి చేరలేదని తెలిపింది. మూడు సంవత్సరాలకు పైగా గడిచినా..5,817 కోట్ల రూపాయల విలువైన పెద్ద నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన ప్రకారం.. డీమోనిటైజేషన్‌కు అనంతరం 98.37% నోట్లు తిరిగి బ్యాంకుల్లో అప్పగించారు. ఇంకా 1.63% నోట్లు మాత్రం ఇంకా ఆర్బీఐకి అందలేదు. అప్పట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్ నోట్లు ఉండగా.. 2025 అక్టోబర్ 31 నాటికి రూ. 5,817 కోట్లకు తగ్గినట్లు ఆర్‌బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించినప్పటికీ రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతున్నాయి.
READ MORE: IND vs AUS: నేడు ఆస్ట్రేలియాతో మూడో టి20.. టీమిండియా కంబ్యాక్ ఇచ్చేనా..?
కాగా.. నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం కొత్త రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. 2016 నవంబర్‌లో ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 24 (1) ప్రకారం ఈ 2 వేల రూపాయల కొత్త నోట్లను జారీ చేసింది. నోట్ల రద్దు తర్వాత తలెత్తిన అవసరాలను తీర్చేందుకే రూ.2 వేల నోట్ల జారీచేశామని ఆర్‌బీఐ గతంలో చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇతర నోట్లు మార్కెట్‌లో తగినంత పరిమాణంలో వచ్చిన తర్వాత 2018-19 సంవత్సరంలో 2 వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేశామని ఆర్‌బీఐ తెలిపింది. అనంతరం 2000 రూపాయల నోట్లు మార్కట్లో క్రమంగా తగ్గిపోయాయి. 2017 మార్చికి ముందు వరకు ఆర్‌బీఐ 2 వేల రూపాయల నోట్లలో 89 శాతం విడుదల చేసింది. 2023 మే 19న 2 వేల రూపాయల నోట్ల రద్దు చేసింది ఆర్బీఐ.. మరోవైపు బ్యాంకులు కూడా రూ.2000 నోట్లను సర్క్యులేట్ చేయకుండా ఆర్‌బీఐ ఆదేశాలు జారీచేసింది.
