Site icon NTV Telugu

RBI Gold Loan Rules: గోల్డ్ లోన్ కోసం ఆర్‌బిఐ కొత్త రూల్స్.. ఇప్పుడు బంగారం విలువలో ఎంత శాతం రుణం పొందొచ్చంటే?

Gold

Gold

ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి లోన్ తీసుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్స్ అందిస్తుంటాయి. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్స్ పై కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. రుణగ్రహీతలు ఇప్పుడు తాకట్టు పెట్టిన బంగారం విలువలో 85%కి సమానమైన రుణాలను పొందవచ్చని తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న బంగారు రుణాలపై ఉపశమనం ప్రకటించారు.

Also Read:Virat Kohli: విరాట్ కోహ్లీపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు..

ద్రవ్య విధాన సమీక్ష సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆర్‌బిఐ గవర్నర్, రూ. 2.5 లక్షల వరకు బంగారు రుణాలపై లోన్-టు-వాల్యూ (ఎల్‌టివి) నిష్పత్తిని 85%కి పెంచుతున్నామని, అయితే ఈ మొత్తంలో వడ్డీ మొత్తం కూడా ఉంటుందని అన్నారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షలు దాటిన రుణాలకు 75శాతంగా నిర్ణయించింది. గతంలో రుణ మొత్తం తాకట్టు పెట్టిన బంగారం విలువలో 75% మించకూడదని ముసాయిదా ప్రతిపాదించింది. ఎవరైన బంగారం బిల్లు లేకపోయినా, వారు ఇప్పటికీ బంగారు రుణం పొందగలరని కూడా ఆయన తెలిపారు. దీని కోసం రుణ గ్రహీత డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

Also Read:Mexico Plane Crash: మెక్సికోలో కూలిన విమానం.. ముగ్గురు మృతి

ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం తాకట్టు పెట్టే పసిడి వస్తువుల రూపంలో ఉంటే ఒక కేజీ, వెండి అయితే 10 కేజీలకు మించకూడదు. గోల్డ్‌ కాయిన్స్‌ రూపంలో ఉంటే ఒక్కో కాయిన్‌ 50 గ్రాములకు, వెండి కాయిన్స్‌ అయితే 500 గ్రాములకు మించరాదు. ఒక వేళ రుణాన్ని తిరిగి చెల్లిస్తే.. అదే రోజున తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వాలి. ఒప్పందంలో తాకట్టు పెట్టే వస్తువుల వివరాలను, విలువ కచ్చితంగా ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. లోన్ తిరిగి చెల్లించకపోతే వేలం ప్రక్రియ వివరాలు, నోటీసు వ్యవధి డాక్యుమెంట్ లో ఉండాలని సూచించింది. 2.5 లక్షల వరకు చిన్న తరహా బంగారు రుణాలకు క్రెడిట్ అప్రైసల్ అవసరం లేదని, ఈ అంశంపై తుది మార్గదర్శకాలను కొన్ని రోజుల్లో విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.

Also Read:PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

జనవరి 1, 2026 నుండి ఈ నిబంధనలను అమలు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ RBIని కోరింది. చిన్న బంగారు రుణాలు తీసుకునే వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన సిఫార్సులలో RBIని కోరింది. 2 లక్షల లోపు బంగారు రుణాలను ప్రతిపాదిత మార్గదర్శకాల నుంచి దూరంగా ఉంచాలని మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఈ వెసులుబాటు ద్వారా తక్కువ సమయంలోనే రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది.

Exit mobile version