Site icon NTV Telugu

RBI: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు ఊరట.. యాప్‌పై ఆంక్షలు ఎత్తివేత

Bake

Bake

బ్యాంక్ ఆఫ్ బరోడాపై ఉన్న ఆంక్షలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎత్తివేసింది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడాకు భారీ ఊరట లభించింది. బాబ్ వరల్డ్ యాప్‌పై ఆంక్షలను ఎత్తివేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. అప్లికేషన్ ద్వారా కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డ్ చేయడానికి బ్యాంక్‌కు అనుమతిస్తుంది. ఈ మేరకు బ్యాంక్‌ విషయాన్ని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Devara: అందరి ఎదురు చూపులు ఆ ఒక్క విషయం మీదే?

మొబైల్‌ అప్లికేషన్‌లో కొన్ని లోపాలు బయటపడడంతో కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. దీంతో దాదాపు 7 నెలలుగా తమ మొబైల్‌ అప్లికేషన్‌పై అమల్లో ఉన్న ఆంక్షలను ఆర్‌బీఐ ఎత్తివేసిందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తాజాగా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని పేర్కొంది. దీంతో కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని తెలిపింది. ఇకపై ఆర్‌బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని బ్యాంక్ ఆప్ బరోడా స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: PhonePe : గుడ్ న్యూస్.. ఫోన్‌పేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చెయ్యాలంటే?

Exit mobile version