NTV Telugu Site icon

RBI Cancelled Bank Licence : బ్యాంకులకు వరుస షాకులిస్తున్న ఆర్‌బీఐ.. 7 బ్యాంకుల లైసెన్స్‌ రద్దు..

Rbi

Rbi

RBI Cancelled Bank Licence : గత కొంత కాలంగా సహకార బ్యాంకులపై సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కాస్త కఠినంగా వ్యవహరిస్తోంట్లుగా కనపడుతోంది. కొన్ని సహకార బ్యాంకులకు జరిమానా విధించడంతోపాటు పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేశారు. ఈ క్రమంలో, జూలై 4, 2024న బనారస్ మర్కంటైల్ కో – ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ ను ఆర్‌బీఐ రద్దు చేసింది. దీనితో పాటు 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 7 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను ఆర్‌బీఐ రద్దు చేసింది. ఇటీవల సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ముంబైలోని సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఉత్తరప్రదేశ్‌ లోని ఘాజీపూర్‌కు చెందిన పూర్వాంచల్ కో – ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌లను రద్దు చేసింది. అంతే కాకుండా.. సుమర్‌పూర్ మర్కంటైల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జై ప్రకాష్ నారాయణ్ నగరి కో – ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, శ్రీ మహాలక్ష్మి మర్కంటైల్ కో – ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, హిరియూర్ అర్బన్ కో – ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌ల లైసెన్సులు కూడా రద్దు చేయబడ్డాయి.

Mouth Breathing Sleep : నోరు తెరిచి నిద్రపోతున్నారా.. జాగ్రత్త సుమీ.. ఈ ఆరోగ్య సమస్యలు రావొచ్చు..

ఇక తాజాగా.. వారణాసిలోని బనారస్ మర్కంటైల్ కో – ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న దృష్ట్యా.. దాని లైసెన్స్ రద్దు చేయబడింది. బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం.. 99.98% మంది డిపాజిటర్లు తమ మొత్తం డిపాజిట్లను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) నుండి స్వీకరించడానికి అర్హులని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. భారతదేశంలోని బ్యాంకుల సహకార బ్యాంకులను ఎవరు పర్యవేక్షిస్తారనేది రాష్ట్ర సహకార సంఘాల చట్టం క్రింద నమోదు చేయబడింది. అదే సమయంలో, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 మరియు బ్యాంకింగ్ లాస్ (కో-ఆపరేటివ్ సొసైటీస్) యాక్ట్, 1955 ప్రకారం RBIచే నియంత్రించబడతాయి. ఇవి 1966 నుంచి ఆర్‌బీఐ పర్యవేక్షణలో ఉన్నాయి.

Viral Video: బాబోయ్ ఎర్ర చీమలతో చట్నీనా.. ఎలా చేస్తారో చూసేయండి..

నిజానికి, లైసెన్స్‌లు రద్దు చేయబడిన సహకార బ్యాంకులకు తగినంత మూలధనం లేదు. ఈ బ్యాంకులు తగినంత డబ్బు సంపాదించలేదు. ఇవి డిపాజిటర్లందరికీ తిరిగి చెల్లింపుకు హామీ ఇవ్వలేవు. బ్యాంకులు వ్యాపారాన్ని కొనసాగించేందుకు అనుమతిస్తే నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల, డబ్బు భద్రత కోసం సహకార బ్యాంకుల లైసెన్స్‌ లను ఆర్‌బిఐ రద్దు చేస్తుంది.