Crypto Currency : క్రిప్టో కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు వ్యసనంలాంటివన్నారు. వీటిని ఏ దేశం కూడా జాతీయ కరెన్సీగా గుర్తించవని తన అభిప్రాయాన్ని మరోసారి వెల్లడించారు. వీటిని నిషేధించాల్సిందే అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ జస్ట్ డిజిటల్ కరెన్సీ అని వాటికి ఎలాంటి విలువ లేదన్నారు. అయితే, వాటికి విలువ ఉన్నట్లుగా మూడో వ్యక్తులు నమ్మిస్తున్నారని చెప్పారు. క్రిప్టో కరెన్సీ అనేది అంతా ఒక బూటకమన్నారు. ఆయన ఓ సందర్భంతో మీడియాతో మాట్లాడుతూ ఏ ఆస్తికైనా, ఆర్థిక ఉత్పత్తికైనా అంతర్గత విలువ అనేది ఒకటి ఉండాలని, కానీ క్రిప్టోల విషయంలో అలాంటి విలువ ఏదీ లేదన్నారు.
Read Also: Actor Vijayakumar: ఆత్మహత్యాయత్నం కేసులో నిర్ధోషిగా మలయాళ నటుడు విజయకుమార్
వీటి విలువ అంతా అభూత కల్పనే అని చెప్పారు. మన దేశంలో జూదం అడటానికి అనుమతి లేదని, జూదాన్ని అనుమతించాలనుకుంటే క్రిప్టోలను జూదంగా పరిగణించాలన్నారు. ధనం పేరుతో జూదం ఆడటాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. అందుకే క్రిప్టోను నిషేధించాలని పిలుపునిచ్చారు. క్రిప్టోకరెన్సీల వృద్ధిని ఎదుర్కొనేందుకు సెంట్రల్ బ్యాంక్ ఇటీవల తన ఈ-రూపాయి లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని పైలట్ మోడ్‌లో ప్రారంభించింది. ఈ సీబీడీసీ అనేది డబ్బు భవిష్యత్ అని, దానిని స్వీకరించడం లాజిస్టిక్స్, ప్రింటింగ్ ఖర్చులను ఆదా చేయడంలో సాయపడుతుందని శక్తికాంత దాస్ చెప్పారు.