Digital Rupee: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) కీలక ప్రకటన విడుతల చేసింది. ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న డిజిటల్ రూపాయిని ప్రజల ముందు లాంచ్ చేయబోతోంది. ఈ-రూపీకి సంబంధించిన పైలట్ లాంచ్ త్వరలోనే చేపడతామని తెలిపింది. పరిమిత వాడకానికి పైలట్ బేసిస్‌లో ఈ డిజిటల్ రూపాయిని అందుబాటులో ఉంచుతామని ఆర్‌బీఐ తెలిపింది. ఈ పైలట్ ప్రాజెక్టు లాంచ్ ద్వారా భారత్‌లో డిజిటల్ రూపాయి వాడకాన్ని పరిశీలించనుంది.
Read Also: Uttarkashi Avalanche: ఉత్తరకాశీ హిమపాతం ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య
సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీపై కాన్సెప్ట్ నోటును ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ జారీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కాన్సెప్ట్ నోటును విడుదల చేస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. అంతేకాకుండా ఈ డిజిటల్ రూపాయి పరిమిత స్థాయి వినియోగానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరెన్సీకి డిజిటల్ రూపాయి అదనపు వెసులుబాటు మాత్రమేనని కూడా ఆర్బీఐ వెల్లడించింది. అయితే ఇతర డిజిటల్ కరెన్సీ మాదిరే అన్నీ లావాదేవీ ప్రయోజనాలు డిజిటల్ రూపాయికి కూడా ఉంటాయని వివరించింది.
Read Also:Thief Jumps into Sea : పర్స్ కొట్టేసి.. తప్పించుకునేందుకు సముద్రంలోకి దూకాడు
క్రిప్టో కరెన్సీలను ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. క్రిప్టో కరెన్సీల వల్ల తీవ్ర ప్రమాదాలున్నాయని హెచ్చరిస్తున్నాయి. వర్చ్యువల్ ఆస్తుల బదిలీపై సంపాదించే లాభాలపై 30 శాతం పన్నులను కూడా ఈ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పన్నుల విధానాన్ని కూడా అమల్లోకి తెచ్చారు. క్రిప్టో కరెన్సీలను రెగ్యులేట్ చేయాలా… లేదా బ్యాన్ చేయాలా.. అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా తన స్పష్టతను తెలియజేయాల్సి ఉంది.