Site icon NTV Telugu

Razakar Twitter Review: వివాదాస్పద రజాకార్ సినిమా హిట్టా ఫట్టా..సినిమా ఎలా ఉందంటే?

Razakar (2)

Razakar (2)

తెలంగాణ చరిత్రను తెలియజేస్తూ ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, తమిళ్ నటుడు విజయ్ తదితరులు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు..

ఈ సినిమాకు ఎన్నో వివాదాలు కూడా ఎదురయ్యాయి.. సినిమాను ఆపేయ్యాలంటూ కోర్టు వరకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.. చివరకు ఎటువంటి అవంతరాలు లేకుండా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా హైదరాబాద్ చరిత్ర పై తీశారు. మనందరం కూడా హైదరాబాద్ నిజాం సంస్థానం గురించి రజాకార్ల గురించి వినే ఉంటాం లేదా చదివే ఉంటాం. ఇప్పటికీ హైదరాబాద్ భారతదేశంలో కలిసిన రోజుని సెప్టెంబర్ 17 తెలంగాణలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. రజాకార్ సినిమాలో ఫస్ట్ ఆఫ్ అంతా నిజాం సంస్థానం గురించి, అప్పుడు ప్రజలు ఎదురక్కొన్న పరిస్థితుల గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు.. సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మరి జనాల స్పందన ఎలా ఉంది రివ్యూ ఎలా ఇచ్చారో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..

ఈ సినిమా గురించి మాటల్లో చెప్పలేము.. చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ వస్తున్నాయి.. అందరు తప్పక చూడాలి అని ట్వీట్ చేశారు..

రజాకార్ నిజాం పాలనలో రజాకార్ వ్యవస్థ ఎంత క్రూరంగా ఉందో.. స్వాతంత్ర్యం కోసం మన ప్రజలు వారిపై ఎలా తిరుగుబాటు చేసారో చూపించే నిజాయితీ ప్రయత్నమే..నా చిన్నతనంలో దీనికి సంబంధించిన కొన్ని కథలు విన్నాను, కానీ ఇన్ని దారుణాలు జరిగాయని తెలిస్తే షాక్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం రజాకార్ల చిత్రహింసలు చాలా కలవరపెడుతున్నాయి ఇది ఎన్నడూ జరగలేదని లేదా వేరే విధంగా జరగలేదని కొంతమంది వ్యక్తులు వాదించవచ్చు. ఇది వారికి కథను ఎవరు వివరించారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ అదంతా చరిత్రలో ఉంది మరియు మార్చలేము.. నిర్మాణ విలువలు బాగున్నాయి.. సంగీతం అద్భుతంగా ఉంది, దీని వలన మన చరిత్రను తెలుసుకోవడం మంచిదే అని ట్వీట్ చేశారు..

హైదరాబాద్‌లో హిందువుల మారణహోమం; మునుపెన్నడూ లేని విధంగా ఒక సినిమాలో చెప్పిన దారుణాల నిజమైన కథ.. ఈ సినిమాను తప్పక చూడాలి..

https://twitter.com/AnkitaBnsl/status/1768223103656869988?t=WjQq7Fq_eTMEoAZLYrSYNQ&s=19

మొత్తానికి ఈ సినిమా వివాదాలు ఎదుర్కొన్నా కూడా జనాలను మెప్పించిందని అర్థమవుతుంది.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Exit mobile version