NTV Telugu Site icon

Raviteja : విమానం లో ప్రత్యక్షమైన రవితేజ.. ఎక్కిడికి వెళ్తున్నాడంటే..?

Whatsapp Image 2023 08 21 At 3.56.01 Pm

Whatsapp Image 2023 08 21 At 3.56.01 Pm

రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. మాస్ మహారాజా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా   టైగర్‌ నాగేశ్వరరావు తో సినిమాతో పాటు ఈగల్‌ సినిమాలో కూడా నటిస్తున్నాడు.కొన్ని రోజులుగా టైగర్‌ నాగేశ్వరరావు సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ తన అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తున్నాడు.1970 కాలంలో స్టూవర్ట్‌పురం లో పాపులర్‌ దొంగగా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యం లో వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి డెబ్యూ డైరెక్టర్‌ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్‌ పై అభిషేక్ అగర్వాల్‌ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇటీవలే విడుదల చేసిన టైగర్‌ నాగేశ్వరరావు టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. మాస్‌ మూవీ ఫ్యాన్స్‌ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌ను ఈ చిత్రం తో అందించబోతున్నట్టు టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది.

మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరావు సినిమాతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ మరియు డైరెక్టర్‌ అయిన కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కావ్య థాపర్ సినిమాలో కీలక పాత్ర లో పోషిస్తుంది.ఈ సినిమాలో నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.తాజాగా రవితేజ విమానం లో ఉన్న స్టిల్‌ ఒకటి నెట్టింట బాగా ట్రెండింగ్‌ అవుతోంది.. విమానంలోని బిజినెస్‌ క్లాస్‌లో దిగిన ఫొటో ను ఇన్‌ స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ.లండన్‌కు పయనం అంటూ ఈగల్‌ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టాడు. ఈగల్‌ సినిమా తరువాత షెడ్యూల్‌ లండన్‌ లో జరుగనున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు రవితేజ. ఈ షెడ్యూల్‌లో రెండు వారాలపాటు ముఖ్యమైన సన్నివేశాల ను చిత్రీకరించనున్నారని సమాచారం.