Site icon NTV Telugu

Raviteja: పాపం.. రవితేజకు ఆకలి కాదా.. అందుకే అలా అవుతున్నారా ?

Raviteja

Raviteja

Raviteja: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అంచలంచెలుగా మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసుకుంటా వెళ్తుంటారు మాస్ రాజా రవితేజ. ఆయన తరహా కామెడీ, యాక్షన్, రొమాంటిక్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమాలంటే ఇష్టపడే ప్రత్యేక అభిమానులున్నారు. కిక్కు, రాజా ది గ్రేట్, ఇడియట్, కృష్ణ, దరువు, ధమాకా, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఈయన కామెడీ టైమింగ్ కి చాలా మంది అభిమానులు పడి పడి నవ్వుకున్నారు. కెరీర్లో ఎంత ఎదిగినా ఆయనలో ఇసుమంత గర్వం కనిపించదు. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Read Also:Chicken prices: తెలంగాణలో కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్‌ రేట్లు

ఇటీవల ఆయన నటించిన రావణాసుర సినిమా అంతగా హిట్ అవ్వలేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో రవితేజ గురించి ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అదేంటంటే రవితేజ ప్రస్తుతం ఒక వ్యాధితో బాధపడతున్నారట. ఈ క్రమంలోనే ఆయనకి ఉన్న వ్యాధిని బయటపెడుతున్నారు. మరి అంతా ఎనర్జిటిక్ గా కనిపిస్తుంటారు రవితేజ. అలాంటి ఆయనకు ఆ వ్యాధి అంటే ఆశ్యర్యం కలుగుతుంది కదూ.. నిజానికి చాలామంది హీరోలు 50,60ఏళ్లు దాటినా వారి మొహంలో ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, మహేష్ బాబు ఈ కోవలోకి వచ్చేవారే. వారి ఏజ్ విషయంలో అస్సలు బయటపడరు. అదే కోవలో రవితేజ కూడా 50 ప్లస్ లోనే ఉన్నారు. కానీ ఆయన మొహం, బాడీ చాలా స్ట్రింక్ అయి స్కిన్ని అవ్వడంతో చాలామంది రవితేజ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అంటూ భావిస్తున్నారు. అవును నిజంగానే రవితేజ ఆకలి లేని ల్యూక్ వ్యాధితో బాధపడుతున్నారట. ఈ ల్యూక్ వ్యాధి వల్ల రవితేజకు ఎక్కువగా ఆకలి వేయకపోవడంతో ఆయన ఫేస్, స్కిన్ మొత్తం డల్లుగా అయిపోయిం చర్మం సాగినట్లుగా కనిపిస్తుందట.

Read Also:Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

Exit mobile version