Ravindra Jadeja: కెప్టెన్ శుభ్‌మాన్ మాట వినని జడేజా.. వీడియో వైరల్!
- భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా
- గొప్పగా పోరాడిన జడేజా, సుందర్
- స్టోక్స్ ప్రతిపాదనను అంగీకరించని జడ్డు
- కెప్టెన్ మాట వినని జడేజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 311 పరుగులు వెనుకబడి ఉంది. అంతేకాదు రెండవ ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (90), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103) పోరాడారు. ఈ ఇద్దరు వెనుదిరిగినా.. వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్; 206 బంతుల్లో 9×4, 1×6), రవీంద్ర జడేజా (107 నాటౌట్; 185 బంతుల్లో 13×4, 1×6) క్రీజులో పాతుకుపోయారు. ఇద్దరు ఆల్‌రౌండర్లు గొప్పగా ఆడి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. అద్భుత ప్రదర్శన చేసిన సుందర్, జడేజాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే జడ్డుకు సబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా క్రీజులో పాతుకుపోవడంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకుండా పోయింది. మాండేటరీ ఓవర్లు (చివరి 15) మొదలు కావడానికి ముందు డ్రాతో మ్యాచ్‌ను ముగిద్దాం అని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. భారత ఆటగాళ్లతో కరచాలనం చేయబోయాడు. అప్పటికే సెంచరీలకు చేరువగా ఉన్న జడేజా, సుందర్‌లు స్టోక్స్ ప్రతిపాదనను అంగీకరించలేదు. దీంతో స్టోక్స్‌తో పాటు ఇంగ్లీష్ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో డ్రెసింగ్ రూమ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నవ్వుతూ కనిపించాడు. భారత ప్లేయర్లు డ్రాకు అంగీకరించకపోవడంతో ఇంగ్లండ్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమైంది.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు జో రూట్, హ్యారీ బ్రూక్ బౌలింగ్‌లో ధాటిగా ఆడారు. బ్రూక్ బౌలింగ్‌లో జడేజా సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. ఆ సమయంలో భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆనంద వాతావరణం కనిపించింది. అర్ధ సెంచరీ లేదా సెంచరీ తర్వాత జడేజా తరచుగా చేసే కత్తిసాము శైలిలో సంబరాలు జరుపుకోవాలని కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సైగలు చేశాడు. అయితే జడేజా కెప్టెన్ సంజ్ఞను పట్టించుకోలేదు. ఈసారి జడేజా వెరైటీ శైలిలో సంబరాలు జరుపుకున్నాడు. ఈసారి జడేజా ‘పుష్ప స్టైల్’లో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘కెప్టెన్ మాట వినని జడేజా’ అంటూ ఫాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

Shubman Gill does the sword celebration for Jadeja after his century 🥰❤️#jadeja #Gill #INDvsENG#INDvsENGTest @imjadeja @ShubmanGill7fc pic.twitter.com/Okug546L5O
— JITENDRA SINGH RATHORE 007 (@JITENDRARA34371) July 28, 2025
SONY EDIT FOR SIR JADEJA. 🫡🇮🇳 pic.twitter.com/xznU0IfCPe
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 28, 2025
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!