Site icon NTV Telugu

Ravi Teja : భర్త మహశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ కు బ్రేక్.. కారణం ఏంటంటే?

Bharta Mahashayulaku Vignapti

Bharta Mahashayulaku Vignapti

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ భర్త మహాశయులకు విన్నప్తి’. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలై నెల రోజులు దాటిపోయినా ఇప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించకపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ ZEE5 కొనుగోలు సంగతి తెలిసిందే. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలైన 4 నుండి 6 వారాల్లో ఓటీటీలోకి వస్తుంటాయి, కానీ ఈ సినిమా విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read : Harish Shankar : ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ పార్టీపై పొలిటికల్ సెటైర్స్.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి రవితేజ గత సినిమాలతో పోలిస్తే మెరుగైన మౌత్ టాక్ లభించింది. అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీనికి ప్రధాన కారణం సంక్రాంతి సీజన్‌లో ఇతర పెద్ద సినిమాలు పోటీలో ఉండటమే. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు, ఇప్పుడు తమ ఇంట్లోనే ఈ సినిమాను వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా ఫిబ్రవరి 20 నుండి ఈ సినిమా ZEE5 లో స్ట్రీమింగ్ అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ZEE5 సంస్థ నుండి కానీ, చిత్ర యూనిట్ నుండి కానీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఆ తేదీ గడిచిపోయినా స్ట్రీమింగ్ కాకపోవడంతో ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయిందేమో అనే టాక్ వినిపించింది.  అందుతున్న సమాచారం ప్రకారం ఇతర భాషా వెర్షన్ల డబ్బింగ్ పనులలో జాప్యం కారణంతో పాటు ఓటీటీ ఒప్పందానికి సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని అందుకే స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వస్తోందని తెలుస్తోంది.

Exit mobile version