Site icon NTV Telugu

Eagle : రెండో రోజు జోరు చూపించిన రవితేజ.. సెకండ్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

Whatsapp Image 2024 02 11 At 9.31.42 Pm

Whatsapp Image 2024 02 11 At 9.31.42 Pm

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ.. “ఈగల్ “.. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 9 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.‘ఈగల్’ మూవీలో రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో నవదీప్.. మరో కీలక పాత్రలో కనిపించాడు.యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి థియేటర్లలో చాలామంది ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ సినిమాకు ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటిరోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.11 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటికే ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో మెల్లగా మౌత్ టాక్ వల్ల ‘ఈగల్’ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు భావించారు.

రెండోరోజు ‘ఈగల్’ మూవీ అదే జోరు కొనసాగించింది.. రెండో రోజు దాదాపు రూ.9కోట్ల గ్రాస్‍ను సొంతం చేసుకుంది.. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ మూవీకి దాదాపు రూ.5 కోట్ల కలెక్షన్స్ దక్కినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా 32.84 శాతం ఆక్యూపెన్సీతో రన్ అవుతున్నట్టు తెలుస్తోంది. మార్నింగ్ షోలకంటే ‘ఈగల్’ మూవీకి సెకండ్ షోలకే ఎక్కువగా డిమాండ్ ఉంది.రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’.. తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలయ్యింది. కానీ హిందీలో కలెక్షన్స్ అంతగా లాభదాయాకంగా కనిపించడం లేదు. మొదటిరోజు హిందీ కలెక్షన్స్ రూ.0.1 కోటిగా ఉండగా.. రెండోరోజు మాత్రం కాస్త పెరిగి రూ.0.13 కోట్లకు చేరినట్లు సమాచారం.మొత్తానికి దేశవ్యాప్తంగా ‘ఈగల్’ కలెక్షన్స్ రూ.10 కోట్ల మార్క్ ను టచ్ చేశాయి. అయితే ఈ సినిమాకు మౌత్ టాక్ బాగానే ఉన్నా కానీ ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించేలా లేకపోవడంతో ఈ మూవీ రన్ త్వరగానే పూర్తవుతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.

 

Exit mobile version