Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ.. తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్ పేరును అనౌన్స్ చేశారు. ఇంతకీ మాస్ మహారాజాను డైరెక్ట్ చేయబోయే ఆ డైరెక్టర్ ఎవరో తెలిసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: CM Revanth Reddy : నేను డాక్టరును కాదు.. సోషల్ డాక్టరును.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ అని ప్రకటించారు. ఆ సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని చెప్పారు. శివ నిర్వాణ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నిన్నుకోరి, మజిలి వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్. ఆయన లాస్ట్ టైం వెండి తెరపై ప్రేక్షకులను పలకరించిన చిత్రం హీరో విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’. ఈ సినిమా తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టుకోలేదు. అయితే ఇటీవల కాలంలో ఆయన మాస్ మహారాజా రవితేజను కలిసి థ్రిలర్ జానర్‌లో ఓ కథ వినిపించగా, ఆ పాయింట్ రవితేజకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతుందని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారక ప్రకటన రాబోతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ఫుల్ సబ్జెట్‌తో రాబోతున్న ఆయన ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ ఇద్దరి కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ జనవరి 13న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
READ ALSO: Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్ ఇతనిదే: రవితేజ
