Site icon NTV Telugu

Bhartha Mahashayulaku Vinnapthi: మాస్ మహారాజా రవితేజ బంగారం: హీరోయిన్ డింపుల్ హయతి

Dimple Hayathi

Dimple Hayathi

Bhartha Mahashayulaku Vinnapthi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విన్నప్తి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో హీరోయిన్‌గా నటించిన డింపుల్ హయతి మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

READ ALSO: కేవలం రూ.21,599కే 55 అంగుళాల BESTON QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ..!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధారణంగా గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యే తనకు, ఈ చిత్రంలో దర్శకుడు కిషోర్ తిరుమల ఒక విభిన్నమైన పాత్రను ఇచ్చారని డింపుల్ పేర్కొన్నారు. “ఈ సినిమాలో నన్ను ఒక కొత్త డింపుల్ హయతిలా చూస్తారు. నా పాత్ర పేరు ‘బాలామణి’. పేరు ఎంత వినసొంపుగా ఉందో, నా నటన కూడా అంతే ఆకట్టుకుంటుంది” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కిషోర్ తిరుమల సెట్‌లో ఉన్నారంటేనే నవ్వుల పువ్వులు పూస్తాయని, ఆ సరదా షూటింగ్ అంతా కొనసాగిందని వివరించారు. హీరో రవితేజ గారితో పని చేయడం అదృష్టం అని, రవితేజతో కలిసి నటించడం ఇది రెండోసారి అని పేర్కొన్నారు. ఆయన ఒక ‘బంగారం’ అని చెప్పారు. ఆయన క్రమశిక్షణ, పని పట్ల ఉన్న నిబద్ధత చూసి చాలా నేర్చుకున్నానని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. రవితేజతో హ్యాట్రిక్ కొట్టేందుకు, మరో సినిమా చేయడానికి కూడా తాను సిద్ధమని మనసులో మాట బయటపెట్టారు. ఆషికా రంగనాథ్ చాలా డౌన్ టూ ఎర్త్ అని, తనతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్నాం తన కెరీర్‌లో ఇది మొదటి సంక్రాంతి సినిమా అని, జనవరి 13న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు.

READ ALSO: Thalapathy Vijay: సంక్రాంతి బరిలో దళపతి విజయ్ మూవీ..

Exit mobile version