Site icon NTV Telugu

Mr Bachchan OTT: ‘మిస్టర్ బచ్చన్’ వచ్చేది ఆ ఓటీటీలోనే!

Mr Bachchan Ott

Mr Bachchan Ott

Ravi Teja’s Mr Bachchan on Netflix: మాస్‌ మహారాజా రవితేజ, డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ కాంబోలో తెరకక్కిన తాజా మూవీ ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘మిర‌ప‌కాయ్’ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. మరోవైపు బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే అందచందాలు, రొమాంటిక్‌ సాంగ్‌తో ఫుల్‌ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. పోస్టర్స్‌, టీజర్‌, సాంగ్స్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఇవాళ నేడు (ఆగస్టు 15) మిస్టర్‌ బచ్చన్‌ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆడియన్స్‌ నుంచి మిక్స్‌డ్‌ రివ్యూస్‌ని అందుకుంటుంది.

Also Read: Double Ismart OTT: ‘డబుల్ ఇస్మార్ట్‌’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌.. భారీ ధరకు హక్కులు!

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మిస్టర్‌ బచ్చన్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి రానుంది, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్‌’ సొంతం చేసుకుంది. అన్ని సినిమాల మాదిరే.. నాలుగు వారాల తరవాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబరు రెండో వారంలో మిస్టర్‌ బచ్చన్‌ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మిక్స్‌డ్‌ టాక్ నేపథ్యంలో అంతకన్నా ముందే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రిలీజ్‌కు ముందుకు ఈ మూవీకి ఉన్న బజ్‌ కారణంగా.. భారీ డీల్‌కి నెట్‌ఫ్లిక్స్‌ ఒప్పందం కుదుర్చకుందట.

Exit mobile version