Site icon NTV Telugu

2026 Sankranti: చిరంజీవి vs రవితేజ.. 2026 సంక్రాంతికి రేసు రసవత్తరం!

Ravi Teja Vs Chiranjeevi

Ravi Teja Vs Chiranjeevi

సంక్రాంతి అంటేనే సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రతి సంక్రాంతికి రెండు మూడు సినిమాలు పోటీ పడుతుంటాయి. నెక్స్ట్ ఇయర్ కూడా గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి నుంచే సంక్రాంతిపై కర్చీఫ్ వేసేస్తున్నారు మేకర్స్. తాజాగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం భాను భోగ‌వర‌పు ద‌ర్శక‌త్వంలో ‘మాస్ జాత‌ర’ సినిమా చేస్తున్న మాస్ రాజా.. త‌న తదుపరి చిత్రాని డైరెక్టర్ కిషోర్ తిరుమ‌లతో చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ సందర్భంగా రవితేజ‌కు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్‌తో రిలీజ్ చేశారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్‌లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. దీంతో వచ్చే సంక్రాంతి వార్ మెగాస్టార్ వర్సెస్ రవితేజగా మారనుందనే చెప్పాలి. ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఒక సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలవగా.. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లోను ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేసేలా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు రవితేజ సినిమా కూడా సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చింది.

Also Read: Bengaluru Stampede: విజయోత్సవాలు వద్దని చెప్పాం.. ఆర్సీబీ వినలేదు!

చిరు, రవితేజతో పాటు తమిళ్‌ స్టార్ హీరో విజయ్ ‘జననాయగన్’ కూడా సంక్రాంతికే రాబోతోంది. అలాగే నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కూడా జనవరి 14న రాబోతోంది. ఈ లెక్కన ఇప్పటిదాకా 2026 సంక్రాంతికి నాలుగు సినిమాలు రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయినట్టే. కానీ మేజర్ బాక్సాఫీస్ వార్ మాత్రం చిరు, రవితేజ మధ్యనే ఉండనుంది. అన్నట్టు బాలయ్య ‘అఖండ 2’ని కూడా సంక్రాంతి బరిలో దింపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2025 దసరా నుంచి ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి వచ్చే సంక్రాంతికి రేసు ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version