Site icon NTV Telugu

Ravi Naidu: రోజా అయినా, బైరెడ్డి అయినా.. ఎవరినీ విడిచిపెట్టేది లేదు!

Saap Chairman Ravi Naidu

Saap Chairman Ravi Naidu

Ravi Naidu Warns Action on Aadudam Andhra Scam: గత వైసీపీ ప్రభుత్వ నాయకులు ‘ఆడుదాం ఆంధ్రా’ని రాజకీయంగా వాడుకున్నారని, నిధుల దుర్వినియోగం భారిగా చేశారని ఏపీ శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. గతంలో రూ.280 కోట్లు నిధులతో పారా అథ్లెటిక్స్ ట్రైనింగ్ కోసం కేటాయిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మళ్లీ కూటమి ప్రభుత్వం వాటి కోసం కృషి చేస్తుందన్నారు. ఆడుదాం ఆంధ్రా విజిలెన్స్ పూర్తి అయిందని, ఏ రోజైనా చర్యలు తీసుకోవడానికి సిద్దం అని తెలిపారు. తప్పు చేసిన వారిని విడిచి పెట్టేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని రవి నాయుడు హెచ్చరించారు.

‘జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. గతంలో నేషనల్ స్పోర్ట్స్ డే అనగానే.. ఓ నలుగురికి శాలువాలతో సన్మానాలు, సత్కారాలు చేసి చేతులు దులిపేసుకున్నారు. జాతీయ స్థాయి క్రీడా కారులకు అందాల్సిన గౌరవం అందలేదు. కానీ ఈ సారి మాత్రం క్రీడాకారులకు పెద్ద పీట వేస్తాము. మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అంతర్జాతీయ స్థాయి కోచ్‌లు పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, ఏమ్మేస్కే ప్రసాద్ సహా యువ అథ్లెట్ ఎర్ర జ్యోతి వంటి ప్రతిభ కలిగిన క్రీడాకారులను భాగస్వాములుగా చేస్తున్నాం. చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. 3 శాతం డీఎస్సీలో 421 పోస్టులు క్రీడా ప్రాతిపదికన కేటాయించడం జరిగింది. ఫారెస్ట్ విభాగంలో కూడా 40 పోస్టులు కేటాయించాము. 480 మంది క్రీడా కారులకు సన్మానాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తాం. 28 వేల మంది క్రీడాకారులు స్పోర్ట్స్ డే వేడుకలలో భాగస్వాములు అవుతారు. ఆగస్టు నెలను స్పోర్ట్స్ మంత్ గా పరిగణిస్తాం. భవిష్యత్లో మరిన్ని స్పోర్ట్స్ అకాడమీలు తీసుకు వస్తాం’ అని రవి నాయుడు తెలిపారు.

Also Read: Prithvi Shaw: టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా డేటింగ్.. ఫొటోస్ వైరల్!

‘ఆడుదాం ఆంధ్రాని రాజకీయంగా వాడుకున్నారు. నిధుల దుర్వినియోగం చేశారు. గతంలో రూ.280 కోట్లు నిధులతో పారా అథ్లెటిక్స్ ట్రైనింగ్ కోసం కేటాయిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం వాటి కోసం కృషి చేస్తుంది. ఆడుదాం ఆంధ్రా విజిలెన్స్ పూర్తి అయింది. ఏ రోజైనా చర్యలు తీసుకోవడానికి సిద్దం. తప్పు చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టేది లేదు. చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. కక్ష్య పూరిత రాజకీయాలు చేయడం లేదు. అవినీతి జరిగిందని స్పష్టంగా వెల్లడి అయింది. ఆర్కే రోజా ఆయినా, బైరెడ్డి సిద్దార్థరెడ్డి అయినా ఎవరినీ విడిచిపెట్టేది లేదు’ అని రవి నాయుడు హెచ్చరించారు.

Exit mobile version