నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్న నటుడు రవిబాబు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ఏదో ఒక ప్రయోగం ఉంటుందని ఆడియన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక చాలా కాలం తర్వాత మరోసారి ఒక వైల్డ్ క్రైమ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈ సినిమాకు ‘రేజర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ, తాజాగా వదిలిన గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లింప్స్ చూస్తుంటే రవిబాబు ఈసారి రూట్ మార్చి చాలా వయలెంట్‌గా సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇక ఈ గ్లింప్స్ వీడియో విషయానికి వస్తే..
Also Read : Baahubali The Epic : ‘బాహుబలి ది ఎపిక్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్
చూసేటప్పుడే బాబోయ్ అనిపించేలా ఉంది. ఇందులో న్యాయం కోసం రవిబాబు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే పాత్రలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులను అత్యంత క్రూరంగా చంపేస్తున్న విజువల్స్ చూస్తే ఎవరైనా సరే ఉలిక్కి పడాల్సిందే. “న్యాయం జరగనప్పుడు అది ఎలా తీర్చుకోవాలో ఆయనకే తెలుసు” అనే రేంజ్‌లో రవిబాబు నటన అదరగొట్టేశారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రాన్ని 2026 వేసవిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రవిబాబు మార్క్ టేకింగ్, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూస్తుంటే సమ్మర్‌లో ఈ ‘రేజర్’ బాక్సాఫీస్ వద్ద గట్టి హిటే కొట్టేలా కనిపిస్తోంది.
