Site icon NTV Telugu

Ravi Babu: టాలీవుడ్‌కు ‘అతి’నే కావాలి..

Ravi Babu

Ravi Babu

టాలీవుడ్‌లో జరిగే హంగామా, ఫ్యాన్స్ క్రేజ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ లో చూపించే అతి మరేక్కడా కనిపించదు. స్టేజ్‌పై ఆర్టిస్టులు మాట్లాడుతుంటే ఫ్యాన్స్ వచ్చి కాళ్లపై పడటం, ఆరడుగుల ఎలివేషన్, మైక్ దగ్గర కేకలు.. ఇలాంటి సీన్లు ఇప్పుడు కామన్ అయ్యాయి. ఈ విషయాలపై నటుడు–దర్శకుడు రవిబాబు బిగ్‌గా స్పందించారు. తెలుగు సినిమాల్లో సీన్‌కు సంబంధం లేకపోయినా ఓవర్ యాక్షన్ చేస్తేనే ఆడియన్స్ మెచ్చుకుంటారని ఆయన స్పష్టంగా చెప్పారు. మురారి సినిమాలో తాను పిచ్చి పిచ్చి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చినా, అదే కారణంగా “టాలీవుడ్‌కు మంచి యాక్టర్ దొరికాడు” అంటూ అందరూ పొగిడారని రవిబాబు చెబుతున్నారు. అతి చేస్తేనే మన ఆడియన్స్ కనెక్ట్ అవుతారనే విషయం తన కెరీర్‌లో చాలా క్లియర్ అయిందని చెప్పారు.

Also Read : Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లో మాస్ ఫైట్.. రిథు కారణంగా కళ్యాణ్ మెడ పట్టుకున్న డీమాన్ పవన్

అలాగే టాలీవుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్స్‌లో ఒకరి గురించి మరొకరు లిమిట్‌ లేని ఎలివేషన్లు ఇస్తారనే విషయంలో కూడా రవిబాబు ఫైర్ అయ్యారు. ఆ మాటలు, ఆ పొగడ్తలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయో తనకే అర్థం కాదని, చాలాసార్లు అసహనంగా అనిపిస్తోంది అని చెప్పారు. మంచి సినిమా చేస్తే చాలు కానీ ఈవెంట్లలో హడావుడి పెంచడం వల్ల అసలు ఫోకస్ సినిమా పై నుంచి తప్పిపోతుందని ఆయన అభిప్రాయం. రవిబాబు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version