Site icon NTV Telugu

Raveena Tandon : ఆ నటుడి పెదవులు తాకగానే వికారంగా అనిపించింది…

Whatsapp Image 2023 09 28 At 9.06.15 Pm

Whatsapp Image 2023 09 28 At 9.06.15 Pm

రవీనా టాండన్‌ ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె వరుసగా హిందీ, తెలుగు తో పాటు పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది.రవీనా టాండన్‌ ప్రముఖ దర్శకుడు రవి టాండన్‌ కూతురిగా సినీమాల్లోకి వచ్చింది. ‘1991’లో పథర్‌ కే ఫూల్‌ అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 1993లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రథసారథి, ఆకాశవీధిలో మరియు పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల్లో నటించింది. చివరగా కేజీఎఫ్‌-2లో రమికా సేన్‌గా నటించింది., అయితే సినిమాల్లోహీరో హీరోయిన్ ల మధ్య ముద్దు సీన్లు, అలాగే రొమాంటిక్ సన్నీవేశాలు కూడా సర్వ సాధారణమే.హిందీ చిత్రాలలో వీటి స్థాయి మరింత ఎక్కువగా ఉంటుంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవీనా టాండన్‌ గతంలో సినిమా షూటింగ్‌ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నది .

రవీనా టాండన్‌ ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటూ వచ్చింది..అయితే, సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో కాంటాక్ట్‌ లాంటివి అస్సలు ఏమీ లేవని, అయినా కూడా ఎప్పుడూ ముద్దు సీన్స్‌లో నటించలేదని రవీనా పేర్కొంది. ఆ సీన్స్‌ తనకు కాస్త అసౌకర్యంగా ఉంటాయని చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ గుర్తుందని ఆమె చెప్పుకొచ్చింది.ఓ సన్నివేశంలో సహనటుడి పెదవులు పొరపాటున తన పెదవులకు తగిలాయని ఆమె తెలిపింది.ఆ నటుడు కావాలని చేయలేదని.. అనుకోకుండానే జరిగిందని కూడా ఆమె తెలిపింది. ఈ ఘటన తనకు ఎంతో అసౌకర్యంగా అనిపించిందని. వెంటనే రూమ్‌లోకి వెళ్లనట్లు అలాగే ఆ తర్వాత వికారంగా అనిపించి.. వాంతి కూడా అయ్యిందని.. నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండనిపించింది అంటూ ఆమె తెలిపింది. అయితే, ఏ సినిమా షూటింగ్‌లో జరిగింది.. ఆ హీరో ఎవరూ అన్నది మాత్రం రవీనా రివీల్ చేయలేదు.అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత హీరోకు సారీ చెప్పినట్లు రవీనా వివరించారు..

 

Exit mobile version