NTV Telugu Site icon

Rave Parties: గోదావరి జిల్లాల్లో రేవ్‌ పార్టీల కలకలం..

Mandapeta Rave Party

Mandapeta Rave Party

Rave Parties: అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవు పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి అశ్లీల నృత్యాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనసేన పార్టీ నేతలు అన్నీ తామై వ్యవహారిస్తూ ఫుల్ జోష్ నింపారు. మహిళలను, వ్యవస్థలను నిర్వీర్యం చేసి మందు కొడుతున్న నృత్యాలు సొషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. ఇదేనా కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ సెటైర్లు… వేస్తున్నారు. మొన్న ఏలూరులో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పుట్టినరోజు పేరున రేవు పార్టీ నిర్వహిస్తే నిన్న మండపేటలో నూతన సంవత్సర వేడుకలు అంటూ రేవు పార్టీ చేశారు. జనసేన మండపేట అసెంబ్లీ నియోజకవర్గ నేతలు ఆధ్వర్వంలో నియోజక వర్గంలోని జనసేన కార్యకర్తలు ఈ రాస లీలలు ఒక ప్రముఖుని లేఅవుట్ లో కొత్త సంవత్సరం సందర్భంగా బహిరంగంగా జరుపుకున్నారు. మహిళల చేత పూర్తిగా దుస్తులు విప్పించి నృత్యాలు చేయించి ఆనందించారు.

భారీ లైటింగు డిజె సౌండ్లు పెట్టుకుని ఓ లేఔట్ లో చేసిన నృత్యాలు అటుగా పోలీసులు తిరిగిన పాపం వారి కంటికి కనిపించలేదు. సోషల్ మీడియాలో వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది మహిళలచే అర్ధనగ్న దుస్తులతో డాన్సులు ఫైట్లు కూడా చేయిస్తూ వారి మధ్య మందు కొడుతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. యువకులు, పెద్దలు వీరితో నృత్యాలు చేయిస్తూ ఎంజాయ్ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రేవు పార్టీ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, వాస్తవానికి ఇది పూర్తిగా పోలీసు కను సన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు బయటకు రాకపోతే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించి ఉండేవారని ప్రజలు ఋకోకొల్లలుగా చెప్పుకుంటున్నారు. ఒక అధికారి రాజు లా అనుమతులు ఇవ్వడంతో ఒంటి మీద బట్టలు లేకుండా రెచ్చిపోయారని స్థానికులు చెప్పుకుంటున్నారు. రేవు పార్టీలో ఉన్నవారిలో మేడిద పుల్లాజీ, ముత్తు, యర్రంశెట్టి సర్వేశ్, గురుమళ్ళ ఈశ్వరరావు, వేల్పూరు ముత్తు, దార్ల నాగు , క్రేన్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్కువ శాతం జనసేన పార్టీ కుర్రాళ్లు ఉన్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ గుట్టును మండపేట పోలీసులు కనుగొన్నారు. మండపేటలోని
గొల్లపుంత రోడ్ లో ఉన్న బుద్ధా స్టాట్యూ ఓం సిటీ లేఔట్ లో సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య నృత్య ప్రదర్శనలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నట్లు మండపేట పోలీసులు గుర్తించారు. అసభ్య నృత్యాలతో జనసేన నాయకుడు. ఈ రేవు పార్టీ నిర్వహించారు. వేలు పూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో డిసెంబరు 31 రాత్రి ఈ వేడుకలు జరిగాయి. జనసేన నేతల న్యూ ఇయర్ రేవ్ పార్టీ వీడియోలు. సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి. జనసేన నాయకుడితో పాటు మరో ఆరుగురిపై మండపేట టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురిపై మండపేట టౌన్ ఎస్ఐ
హరికోటి శాస్త్రికేసు నమోదు చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి మండపేట గొల్లపుంత కాలనీ రోడ్డులోని RR ఓం సిటీ రియల్ ఎస్టేట్ లేఔట్ లో రేవ్ పార్టీ నిర్వహించారు.. లే అవుట్ లోని బుద్ధుడి విగ్రహం ఎదుట అశ్లీల నృత్యాలు నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనసేన నేతలే.. రేవ్ పార్టీ నిర్వహించినట్లు అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే, ఇటీవల గోదావరి జిల్లాలో పలుచోట్ల రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా వరుసగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అశ్లీల, అసాంఘిక కార్యకలాపాలు మాత్రమే జరుగుతున్నాయని డ్రగ్స్ వినియోగిస్తే అది రేవ్ పార్టీనేరంగా పరిగణిస్తామని అంటున్నారు పోలీసులు.. మండపేట అధికార కూటమి పార్టీ అండదండలతోనే రేవ్ పార్టీ నిర్వహించారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫైర్ అయ్యారు. జిల్లా లోనే మునుపెన్నడూ లేని విష సంస్కృతి మండపేట పట్టణ నడిబొడ్డిలో చోటు చేసుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. అధికారుల చర్యలు నామ మాత్రంగా ఉన్నాయంటే దీని వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
అధికార పార్టీ నాయకులు జరిగిన ఘటనపై స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని అందరూ గుర్తు చేసుకోవాలి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు..

Show comments