NTV Telugu Site icon

Ravanasura: ఈ పాట వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయే

Raviteja

Raviteja

Ravanasura: మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం రావణాసుర. ఆర్టి టీం వర్క్స్ సంస్థ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ఐదుగురు భామలు నటిస్తున్నారు, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్ష నగర్కార్ సందడి చేయనుండగా హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రావణాసుర థీమ్ సాంగ్ అయితే అద్భుతమని చెప్పాలి. మొదట్లో ఈ సాంగ్ ను ఒక పార్టీలో సింగర్స్ పాడుతూ వినిపించారు.

Kim Sharma: ‘ఖడ్గం’ బ్యూటీ ఎఫైర్స్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు..?

ఇక తాజాగా ఈ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రావణ.. రావణ.. దశగ్రీవ రావణ అంటూ సాగిన ఈ సొగ్ ఆద్యంతం గూస్ బంప్స్ నుతెప్పిస్తుంది. రావణాసురుడు పది తలలు.. వాటి లక్షణాలను ఈ సాంగ్ లో పొందుపరిచడమే కాకుండా రావణాసురుడు ఎలాంటి వాడు అన్నది కూడా తెలిపారు. ఆ రావణాసురుడే.. ఈ సినిమాలో హీరోలా పుట్టినట్లు తెలియజేశారు. ఇక ఈ సాంగ్ కు శ్రీ హర్ష ఈమని అందించిన సాహిత్యం, అరుణ్ కౌండిన్య పాడిన తీరు మ్యూజిక్ లవర్స్ ను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తుందని చెప్పొచ్చు. ఇక వీడియోలో రవితేజ రావణ అవతార ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మొత్తానికి ఈ సాంగ్ తో రావణాసుర కు హైప్ తెచ్చారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలంటే ఏప్రిల్ 7 వరకు ఆగాల్సిందే.