NTV Telugu Site icon

Ration Rice Seized: మహారాష్ట్రకు భారీగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలు పట్టివేత..!

8

8

స్థానిక అధికారుల కళ్ళు తప్పి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో కాలేశ్వరం వద్ద రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను హైదరాబాద్ కు చెందిన సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ఈ దాడులలో ఏకంగా 900 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ఆపరేషన్ లో రెండు వాహనాలను సీజ్ చేసి, ఆపై నలుగురిపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ బియ్యాన్ని సంబంధిత రెవెన్యూ అధికారులకు అప్పగించి., వాహనాలను అలాగే ఆ నలుగురు నిందితులను మహదేవపూర్ పోలీసులకు అధికారులు అప్పగించారు.

Also read: Vizag Drug case: ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్.. ఏపీలో కలకలం.. సీబీఐ విచారణలో ఏం తేలింది?

రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో నుంచి టన్నులకొద్దీ బియ్యం సరిహద్దులు దాటి మహారాష్ట్రకు తరలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్ అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే మహారాష్ట్రలో ఉన్న చట్టం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది.

Also read: Family Court: స్త్రీ బొట్టు పెట్టుకోవడం మతపరమైన బాధ్యత..

ఈ నేపథ్యంలో భాగంగా కాలేశ్వరం వద్ద గోదావరి వంతెన అడ్డాగా చేసుకొని ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. అయితే ఈ విషయంపై అధికారులు చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. మహారాష్ట్రలో రేషన్ బియ్యం పై నియంత్రం లేకపోవడాన్ని అనుకూలంగా మార్చుకొని ఈ అక్రమ దందాకు తెరలేపినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు కొన్ని టన్నుల కొద్ది రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతున్నట్లు అధికారులు తెలిపారు. నిజానికి ప్రతి నెల మొదటి రెండు వారాలపాటు రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతుండడం చూస్తే ఎంత పెద్ద మొత్తంలో సబ్సిడరేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయో అర్థమవుతుంది.

Show comments