బిగ్ బాస్ హౌస్ లో నిన్న ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే.. సీరియల్ నటి పూజా మూర్తి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. ఇకపోతే రతికా పాప మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.. మూడు వారాల కన్నా ఎక్కువ హౌస్‌లో ఉండి ఎలిమినేట్ అయిన ముగ్గురిలో ఒకరు హౌజ్‌లో రీ ఎంట్రీ ఇవ్వచ్చని నాగార్జున బంపరాఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే చివరిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగ్. తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లని హౌస్ మేట్‌గా పంపిస్తానన్నారు. దీంతో రతికా పాపే హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. లాంగ్ ఫ్రాక్‌లో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేసిన రతికాకు నాగ్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాడు..
ఇక మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీకి మరో అవకాశం ఇచ్చిన నాగ్ కు ధన్యవాదాలు తెలిపింది.. అలాగే సెకెండ్ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని, మొదటి సారి చేసిన తప్పులు మళ్లీ చేయకని నాగ్ ఆమెకు సలహా ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ చెప్పి హౌజ్‌లోకి పంపించేశారు.. ఇక హౌస్ డోర్ ఓపెన్ చెయ్యగానే శివన్న కనిపించాడు..మొదట మీరే కనిపించారు అంటూ శివాజీని హగ్ చేసుకుంది. అతను కూడా రా బిడ్డా.. రా అంటూ ఆమెను ఆప్యాయంగా పలకరించాడు. ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఒక్కొక్కరు కూడా రతికకి స్వాగతం పలికారు. టేస్టీ తేజా అయితే ఎదురెళ్లి మరీ ఆలూ కూర కలిపి అన్నం ముద్దలు పెట్టాడు. ఇక ప్రిన్స్ యావర్‌కి గట్టిగా హగ్ ఇచ్చిన రతిక కొత్త కంటెస్టెంట్లను పరిచయం చేసుకుంది..
ఆ తర్వాత లోపలికి వెళ్ళిన రతిక శివాజీ కాళ్లు పట్టుకొని తప్పయింది అంటూ క్షమించమని కోరింది.. ఇక జరగదని కోరింది.. అంటే ఇప్పుడు లోపలికి రాగానే మళ్లీ కాక పట్టడం మొదలు పెట్టేసింది..ఎలిమినేట్ అయినప్పుడు నీ గురించి స్టేజ్ మీద ఏం చెప్పలేకపోయినా.. ఎందుకంటే ఏమైనా మాట్లాడితే నాకు ఏడుపొచ్చేసేది . అందుకే ఏడవకూడదనే నీ గురించి ఏం చెప్పలేదు’ అని ఏడ్చేసింది. ‘ అలా ఏం లేదులేరా బిడ్డా.. ఇక్కడ పర్సనల్ ఈగోలు ఏం ఉండవు.. ఇక్కడ గేమ్ ఆడేందుకు వచ్చాం. దాని మీద దృష్టి పెట్టు.. బాగా ఆడు.. ఈ క్షమాపణలు ఎందుకు. తప్పు తెలుసుకున్నావ్ అది చాలు’ అని శివాజీ రతికను ఓదార్చాడు. మరి తన విచిత్ర ప్రవర్తనతో ఎలిమినేట్అయిన రతిక రీఎంట్రీలోనైనా జనాలను మెప్పించి విన్నర్ అవుతుందేమో చూడాలి..